colors on butterflies wings :ఇంద్రధనస్సులోని రంగులు సీతాకోక చిలుకలకు ఎలా వచ్చాయి? అవి విభిన్న రంగుల్లో ఉండడానికి కారణాలేంటి? ఆకులు, ఎండిపోయిన ఆకుల్లో కలిసిపోయేలా రంగులు మారడంలో వాటి శరీర నిర్మాణం ఎలా ఉంటుంది? ఇలాంటి సందేహాలపై 'ఈటీవీ భారత్' స్పెషల్ స్టోరీ.
గుర్రాలు ఎందుకు పడుకోవు? - మీకు 'హార్స్ పవర్' అంటే తెలుసా?
సైనికుల యూనిఫాం తలపించేలా కనిపిస్తున్న సీతాకోక చిలుక (ETV Bharat) ప్రధానంగా రెండు కారణాలు
కీటకాల రెక్కలపై రంగును శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి అనేక పరిశోధనలు జరిగాయి. కీటకాల రెక్కలకు రంగు రావడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయని పరిశోధకులు తేల్పారు. అందులో మొదటిది వర్ణద్రవ్యం, రెండోది వాటి రెక్కల నిర్మాణం. కొన్ని కీటకాల రెక్కలపై వర్ణద్రవ్యం ఉంటుంది. దీని కారణంగా రెక్కలకు రంగు వస్తుంది. సీతాకోకచిలుకల రెక్కలపై నలుపు, తెలుపు, ఎరుపు, పసుపు రంగులు వర్ణద్రవ్యం వల్లనే వస్తాయి. వాటి ఆహారం, పరిసరాలతో పాటు జన్యువులపై ఆధారపడి రంగులు మారుతుంటాయి.
కీటకాల రెక్కలపై చిన్న చిన్న నిర్మాణాల వల్ల కూడా రంగు ఆధారపడి ఉంటుంది. ఈ నిర్మాణాలు కాంతిని వక్రీభవించడం ద్వారా రంగును సృష్టిస్తాయని సమాచారం. సీతాకోకచిలుకల రెక్కలపై నీలి రంగు వాటి నిర్మాణాత్మక రంగు వల్లనే వస్తుందని పరిశోధనలు తేల్చాయి. వర్ణద్రవ్యం మాత్రమే కాకుండా రెక్కల ఉపరితలంపై ఉండే చిన్న నిర్మాణాలు కాంతిని మార్చేందుకు కారణం కావడం నిజంగా విశేషం.
ఎందుకు రంగులు మార్చుకుంటాయి?
కీటకాలు తమ మనుగడ కోసం రెక్కల రంగు మార్చుకుంటాయి. ముఖ్యంగా ఆహార సేకరణకు, అకస్మాత్తుగా దాడి చేయడానికి, ఇతర కీటకాలు, శత్రువుల బారి నుంచి రక్షించుకోవడానికి మరీ ముఖ్యంగా భాగస్వాములను ఆకర్షించడానికి రంగులు మారుస్తుంటాయి.
కొన్ని శాస్త్రీయ పరిశోధనలు, ఆధారాలపై డ్యూక్ యూనివర్సిటీ లైబ్రరీ ప్రచురించిన ప్రత్యేక కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాంతి తరంగాల వక్రీభవనం
కీటకాల రెక్కలపై వర్ణద్రవ్యాన్ని గుర్తించడానికి, దాని రసాయన కూర్పును విశ్లేషించడానికి పరిశోధకులు అనేక పద్ధతులు ఉపయోగించారు. అదే విధంగా రెక్కలపై నిర్మాణాలను అధ్యయనం చేయడానికి ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ వంటి ఆధునిక పద్ధతులు ఉపయోగించారు. రెక్కలపై ఉండే చిన్న చిన్న నిర్మాణాలు కాంతిని వక్రీభవించడం వల్ల రంగును సృష్టిస్తాయని పరిశోధనల్లో తెలిసింది.
వర్ణద్రవ్యం అంటే కాంతి కొన్ని తరంగదైర్ఘ్యాలను గ్రహించి ప్రతిబింబించే పదార్థాలు. ఈ ప్రతిబింబమే మనకు రంగులా కనిపిస్తుంది. కీటకాలు వర్ణద్రవ్యాన్ని తాము తినే మొక్కల నుంచి గ్రహిస్తాయి. ఈ వర్ణద్రవ్యం తరువాత వాటి రెక్కలలో ఇమిడిపోతుంది. తద్వారా ఆకులపై ఉండే కీటకాలు ఆకుపచ్చ రంగులో, ఎండిపోయిన ఆకుల మాదిరిగా కనిపించడానికి అదే కారణం.
- కీటకాలు సంక్లిష్ట జీవరసాయన ప్రక్రియల ద్వారా స్వంత వర్ణద్రవ్యాన్ని కూడా ఉత్పత్తి చేయగలవని నిరూపితమైంది.
- మెలనిన్ అనేది నలుపు, గోధుమ, లేత గోధుమ రంగులను ఉత్పత్తి చేసే ఒక సాధారణ వర్ణద్రవ్యం కాగా, కెరోటినాయిడ్లు పసుపు, నారింజ, ఎరుపు రంగులకు కారణం. ఇక పసుపు, నారింజ, ఎరుపు, నీలం రంగులతో సహా అనేక రకాల రంగులను ప్టెరిన్లు ఉత్పత్తి చేయగలవని తేలింది.
- సీతాకోకచిలుకలు మనకు కనిపించని అతినీలలోహిత రంగు నమూనాలు కొన్ని ఫోటోగ్రాఫిక్ కెమెరాలు గుర్తించాయి. ముదురు రంగు అంటే యూవీ కిరణాల ద్వారా ప్రకాశవంతమైన రంగులు వెదజల్లుతాయి.
ధర తక్కువ ఫోన్లతో బుక్ చేస్తే తక్కువ ఛార్జీలు? - ఓలా, ఉబర్‌కు కేంద్రం నోటీసులు
దేశంలో రైల్వేలైన్ లేని రాష్ట్రం - అక్కడి ప్రజలు ఆదాయ పన్ను కూడా చెల్లించరట!