Remove Turmeric Stains :రోజూ మనం ఇంట్లో రకరకాల కూరలు వండుతుంటాం. ప్రతి కర్రీలోనూ పసుపు తప్పకుండా వేస్తాం. ఈ క్రమంలో కొన్నాళ్లకు ఆ గిన్నె లోపలి వైపు పసుపు పచ్చగా మారిపోవడం, మెరుపు కోల్పోవడం వంటివి గమనిస్తుంటాం. గిన్నెలపై ఏర్పడిన పసుపు మరకలు స్టీల్ స్క్రబ్బర్‌తో ఎంత రుద్దినా ఓ పట్టాన వదలవు. అయితే, కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఈజీగా పసుపు మరకలను తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలు మీ కోసం.
బేకింగ్ సోడా :
ముందుగా గిన్నెలోకి 2 టేబుల్స్పూన్ల బేకింగ్ సోడా తీసుకుని ఇందులో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని పసుపు మరకలున్న గిన్నె లోపలి వైపు పూయాలి. అరగంట తర్వాత స్క్రబ్బర్‌తో రుద్దాలి. ఇప్పుడు సాధారణ డిష్‌వాష్ లిక్విడ్‌తో శుభ్రం చేస్తే మరక వదిలిపోతుంది.
నిమ్మరసం :
నిమ్మలోని ఆమ్ల గుణాలకు ఎలాంటి మరకనైనా తొలగించే లక్షణం ఉంటుంది. అందుకే దీన్ని నేచురల్ క్లీనర్ అని పిలుస్తారు. ఇందుకోసం వేడినీళ్లలో కొంచెం నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని పసుపు మరక ఉన్న గిన్నెలో నింపాలి. నైట్ మొత్తం అలాగే ఉంచి ఉదయాన్నే అన్ని గిన్నెలతో పాటు సాధారణంగా శుభ్రం చేస్తే సరిపోతుంది. ఇక్కడ నిమ్మరసానికి బదులు వెనిగర్ కూడా ఉపయోగించవచ్చు.
హైడ్రోజన్ పెరాక్సైడ్ :
హైడ్రోజన్ పెరాక్సైడ్ పాత్రలపై పడిన పసుపు మరకల్ని తొలగించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మరక ఉన్న చోట కొన్ని చుక్కల ఈ ద్రావణాన్ని వేసి పావుగంట పాటు అలా వదిలేయాలి. అనంతరం సాధారణంగా కడిగేస్తే ఫలితం కనిపిస్తుంది.
టూత్‌పేస్ట్ :