Coffin cafe idea in japan :చనిపోయి మళ్లీ బతికితే ఎలా ఉంటుందంటారు? మరో అవకాశం ఉంటే అన్ని తప్పులు సరిచేసుకుని మంచి పనులు చేయొచ్చనుకుంటారు చాలా మంది. అది ఎలాగో సాధ్యం కాదని తెలుసు. అందుకే జపాన్ సంస్థ ఓ సదవకాశాన్ని కల్పిస్తోంది. జనాలకు ఇది బాగా నచ్చడంతో ఆ అవకాశాన్ని వినియోగించుకుని మళ్లీ కొత్తగా పుట్టేందుకు క్యూ కడుతున్నారు. ఇంతకీ ఆ ఛాన్స్ ఏంటో తెలుసా? కొత్త కాన్సెప్ట్ పూర్తి వివరాలేంటో చూసేద్దాం పదండి.
జపాన్ దేశం మనకన్న 20 ఏళ్లు ముందుంటుదట. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన జపాన్ దేశంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఓ సంస్థ ఉంది. దాదాపు 120ఏళ్ల చరిత్ర కలిగిన ఆ సంస్థ నిర్వాహకులు ఇటీవల "కొఫిన్ కెఫె" అనే పేరుతో ఒక థీమ్ ప్రారంభించాకు. అదొక కేఫ్. అక్కడ టీ, కాఫీతో పాటు మరో రిఫ్రెష్మెంట్ ఐటమ్ కూడా ఉంది. దాని గురించే మనం ఇప్పుడు చెప్పుకొనేది. కేఫ్‌కు వచ్చేవాళ్లు కూర్చోవడానికి కుర్చీలు, టేబుళ్లతోపాటు శవ పేటికలు కూడా ఉన్నాయక్కడ. వాటన్నింటినీ మూడు రంగుల్లో చూడ ముచ్చటగా తీర్చిదిద్దారట.
మీ హైట్ ఏంటి, వెయిట్ ఏంటి? - ఎవరెంత బరువుండాలో ఈ ఫార్ములాతో తెలుసుకోండి!
టీ, కాఫీ కోసం కేఫ్‌కు వెళ్లిన వారు తమకు సమయం ఉంటే శవపేటికల్లో పడుకోవచ్చు. అందుకు గాను 2వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకని నిర్వాహకులను అడిగితే వారు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? 'మరణించిన వారికి అంత్యక్రియలు జరిపించడానికి వారి ఆత్మీయులు, బంధువులు ఎంతో మంది మా వద్దకు వస్తుంటారు. వారిలో ఎక్కువ మంది ఒత్తిడి తట్టుకోలేకో, లేదా మరే ఇతర కారణంతోనో బలవన్మరణాలకు పాల్పడినట్లు మాకు తెలుస్తుంది. చాలా చిన్న చిన్న సమస్యలకే ఆందోళనకు గురై విలువైన ప్రాణాలను తీసుకుంటున్నారని మాకు అర్థమైంది. అలాంటి వారికి మనసు తేలిక పరిచేలా జీవితంపై కొత్త ఆశలు చిగిరించేలా చేయడానికే మేం ఈ శవపేటిక ఆలోచన చేశాం' అని తెలిపారు.