ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

సంక్రాంతి స్పెషల్ ​"రాగి లడ్డూలు" - తిని తీరాల్సిందే! - RAGI LADDU RECIPE

-ఈజీగా ఇలా లడ్డూ చుట్టేయండి! -రుచికి రుచీ ఆరోగ్యానికి ఆరోగ్యం

How to Make Ragi Laddu Recipe
How to Make Ragi Laddu Recipe (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 9 hours ago

How to Make Ragi Laddu Recipe :తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ వచ్చేసింది. ఇక పండగ అంటే పిండి వంటల ఘుమఘుమలు ఉండాల్సిందే. మురుకులు, అరిసెలు, సకినాలు వంటి రకరకాల పిండివంటలు తయారు చేసే పనిలో నిమగ్నమైపోయారు మహిళలు. అయితే, ఈ సంక్రాంతి పిండి వంటల్లో రాగి లడ్డూ తప్పక ఉండాల్సిందే. ఎక్కువ మంది పండగకు రవ్వ లడ్డూలు, బూందీ లడ్డూలు చేస్తుంటారు. అయితే, ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ సారి రాగి లడ్డూలు చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకా రాగుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఈ లడ్డూలు తింటే ఎముకలు బలంగా ఉంటాయి. మరి సింపుల్​గా రాగి లడ్డూలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • రాగి పిండి-2 కప్పులు
  • బెల్లం - కప్పున్నర
  • జీడిపప్పు - పావకప్పు
  • బాదం - 20
  • యాలకుల పొడి - టీస్పూన్​
  • జాజికాయపొడి - 2 చిటికెలు
  • నెయ్యి - సరిపడా
  • ఎండుకొబ్బరి తురుము - పావు కప్పు

తయారీ విధానం :

  • ముందుగా జీడిపప్పు, బాదం ముక్కలుగా కట్​ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • ఇప్పుడు స్టౌపై పాన్​ పెట్టి రాగిపిండి వేయండి. స్టౌ లో ఫ్లేమ్​లో ఉంచి టేబుల్​స్పూన్​ నెయ్యి వేసి, పిండిని కలుపుతూ వేపండి.
  • రాగి పిండి మంచి సువాసన వస్తున్నప్పుడు ఇందులో ఎండుకొబ్బరి తురుము వేసి వేపండి.
  • అనంతరం పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే పాన్​లో టేబుల్​స్పూన్​ నెయ్యి వేసి కరిగించండి.
  • వేడివేడి నెయ్యిలో బాదం, జీడిపప్పు ముక్కలు వేసి దోరగా ఫ్రై చేయండి.
  • ఇప్పుడు బాదం, జీడిపప్పులను రాగి పిండిలో నెయ్యితో సహా వేసి కలుపుకోండి.
  • ఇందులోనే జాజికాయపొడి, యాలకుల పొడి వేసి మిక్స్​ చేయండి.
  • ఇప్పుడు అదే పాన్​లో బెల్లం, కొద్దిగా నీరు వేసి కరిగించండి.
  • బెల్లం పాకంలా కాకుండా పూర్తిగా కరిగించండి చాలు. కరిగిన బెల్లాన్ని రాగి పిండిలోకి జాలి గరిటె సహాయంతో వడకట్టుకోండి.
  • ఆపై పిండిని బాగా మిక్స్​ చేయాలి. ఇప్పుడు చేతులను చల్లటి నీళ్లలో ముంచి కాస్త నెయ్యి రాసుకుని లడ్డూలు కట్టుకోవాలి. ( ఈ రాగి లడ్డూలు కాస్త వేడిగా ఉన్నప్పుడే తయారు చేసుకోవాలి.)
  • ఒకవేళ ఏ కారణంతోనైనా లడ్డూలు కట్టడం రాకపోతే, రెండు చెంచాల వేడివేడి నీరు రాగి పిండిలో పోసి లడ్డూలు తయారు చేసుకోండి. ఇలా చేస్తే పర్ఫెక్ట్​గా వస్తాయి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే టేస్టీ అండ్​ హెల్దీ రాగి లడ్డూలు మీ ముందుంటాయి!
  • నచ్చితే మీరు కూడా ఈ సంక్రాంతికి రాగి లడ్డూలు ట్రై చేయండి.

కోడిపందేలు, రికార్డింగ్ డాన్సులు - ఎక్కడెక్కడ ఏమేం స్పెషల్ అంటే!

"ఆంధ్రా స్టైల్​ నాటుకోడి బిర్యానీ"- ఈ సంక్రాంతికి మరింత స్పైసీగా!

ABOUT THE AUTHOR

...view details