How to Make Poha Kesari :మనలో చాలా మందికి కేసరి అంటే ఎంతో ఇష్టం. ఒక కప్పు తినగానే మళ్లీ మరో కప్పు వేసుకుని తింటుంటాం. ఎందుకంటే నోట్లో వేసుకోగానే ఆ స్వీట్ ఫ్లేవర్‌కి ఇంకాస్త తినాలనిపిస్తుంది. అయితే, నార్మల్‌గా అందరూ బొంబాయి రవ్వ, సేమియాతో కేసరి చేస్తుంటారు. అయితే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతం అందరి అభిరుచులు కూడా ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అన్నట్లుగా ప్రయోగాలు చేస్తున్నారు. ఆ కోవలోనే ఇటీవల అటుకులతో చేసే కేసరిపై ప్రజల్లో మక్కువ పెరుగుతోంది. దీంతో ఈ రెసిపీ మీ వద్దకు తీసుకొచ్చాం. ఒక్కసారి ఇలా సంక్రాంతి పండక్కికేసరిచేసి పెట్టారంటే పిల్లలు, పెద్దలందరూ 'వన్ మోర్ కప్' అని పక్కా అంటారు. ఈ అటుకుల కేసరి వేడివేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా సింపుల్‌గా అటుకుల కేసరి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
అటుకుల కేసరికి కావలసిన పదార్థాలు :
- అటుకులు - కప్పు
- వాటర్ - ఒకటిన్నర కప్పు
- పాలు - కప్పు
- ఆరెంజ్ ఫుడ్ కలర్ - చిటికెడు (ఆప్షనల్)
- కిస్మిస్ - 10
- జీడిపప్పులు -10 గుప్పెడు
- యాలకుల పొడి -అర టీస్పూన్
- నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు
- పంచదార - కప్పు
తయారీ విధానం :
- ముందుగా స్టౌపై పాన్ పెట్టండి. ఇందులో అటుకులు వేసి ఒక రెండు నిమిషాలు దోరగా వేపుకోండి. (స్టౌ లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసి అటుకులు ఫ్రై చేస్తే రంగు మారకుండా వేపుకోవచ్చు.)
- అటుకులు చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్‌లో నెయ్యి వేసి కరిగించండి. వేడివేడి నెయ్యిలో జీడిపప్పులు, కిస్ మిస్‌లు వేయించండి. ఆపై వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- తర్వాత అదే పాన్‌లో గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడి వేసి వేపుకోండి. అటుకుల నుంచి మంచి సువాసన వస్తున్నప్పుడు నీరు వేసి కలపండి.
- మిశ్రమం చిక్కగా మారిన తర్వాత పాలు పోసి మిక్స్ చేయండి. అలాగే ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి కలపండి.
- ఇప్పుడు స్టౌ మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసి అటుకుల మిశ్రమం ఉడికించుకోండి.
- అనంతరం కేసరిలో కాస్త నెయ్యి, యాలకుల పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలపండి.
- ఒక రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేస్తే వేడివేడి అటుకుల కేసరి మీ ముందుంటుంది.
- ఈ కేసరి నచ్చితే మీరు ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేయండి.
కజ్జికాయలు పీటలేకుండానే చేతులతో వత్తేయండిలా - నిమిషానికి ఒకటి చేసేస్తారు!
పిండి లేకుండా చిలగడదుంపతో "గులాబ్జామున్" - నోట్లో వేసుకోగానే కరిగిపోతాయ్!