ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

'దహీ ఇడ్లీ' సింపుల్ టిప్స్​తో ఇలా ట్రై చేయండి - ఒక్కటి కూడా వదలరు - DAHI IDLI RECIPE IN TELUGU

ఇడ్లీ మిగిలిపోయాయా? - నోరూరించే 'దహీ ఇడ్లీ' అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు

dahi_idli_recipe_in_telugu
dahi_idli_recipe_in_telugu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2025, 12:51 PM IST

Dahi Idli Recipe in Telugu :ఇంట్లో ఎప్పుడూ ఇడ్లీ టిఫిన్ పెడుతున్నారా? వారంలో రెండుమూడు రోజులు ఇడ్లీ తిని బోర్ కొట్టేసిందా? అదే ఇడ్లీని టేస్టీగా, సరికొత్తగా ఆరగించాలని అనుకుంటున్నారా? అయితే, ఇది మీ కోసమే. సమయం, సందర్భం ఇవేమీ అక్కర్లేకుండా రుచికరమైన, హెల్తీ ఇడ్లీని సిద్ధం చేసుకుందామా? ఇప్పటి వరకు మీరు దహీ వడ (పెరుగు వడ) మాత్రమే విని ఉంటారు. దాని రుచి వేరే లెవల్ లో ఉంటుంది. దాదాపు అంతే రుచిలో, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే దహీ ఇడ్లీ (పెరుగు ఇడ్లీ)ని తయారు చేద్దాం. దహీ ఇడ్లీ తయారీకి పెద్దగా కష్టపడాల్సిన పన్లేదు. నిత్యం ఇంట్లో ఉండే పదార్థాలతోనే దీనిని తయారు చేసుకోవచ్చు. అంతే కాదు పెరుగు ఇడ్లీ రెసిపీ పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఉదయం టిఫిన్ కోసం చేసిన ఇడ్లీలు మిగిలిపోతే లంచ్ బాక్సులకి కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉపయోగపడుతుంది. ఇంకా ఇడ్లీలు మిగిలిపోయినా పెరుగు ఇడ్లీ తయారు చేసుకుని సాయంత్రం కూడా ఆరగించొచ్చు.

నోరూరించే ఫ్లఫ్ఫీ బన్ ​దోసె - నానబెట్టే పనిలేకుండా పది నిమిషాల్లో రెడీ!

ముందుగా ఇలా సిద్ధం చేసుకోవాలి

1. అప్పటికప్పుడు చేసిన ఇడ్లీలు సున్నితంగా, మృదువుగా ఉంటాయి. కానీ, ఉదయం చేసి పక్కకు పెట్టినవి గట్టిపడిపోతాయి. అందుకే వాటిపై నీళ్లు చల్లుకుని అవి మృదువుగా ఉండేలా చూసుకోవాలి.

2. దహీ ఇడ్లీ కోసం గడ్డ పెరుగు కాకుండా పలుచగా ఉండేది తీసుకోవాలి. చిక్కని పెరుగు తీసుకుంటే అందులోని నీటిని ఇడ్లీ పీల్చుకుని పెరుగు పైన పేరుకుపోయి ఉంటుంది. కాసిన్ని నీళ్లు కలుపుకొని చిలక్కొట్టుకుని పలుచగా తయారు చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది.

మీరు తెస్తున్న చికెన్ మంచిదేనా? - తాజా, కల్తీ మాంసం ఎలా గుర్తించాలంటే!

కావాల్సిన పదార్థాలివే :

  • 7 - 8 ఇడ్లీలు
  • అర లీటర్ పెరుగు
  • ఉప్పు – రుచికి సరిపడా
  • టేబుల్ స్పూన్ పంచదార
  • తాలింపు కోసం
  • టేబుల్ స్పూన్ నూనె
  • టేబుల్ స్పూన్ ఆవాలు
  • అర టేబుల్ స్పూన్ జీలకర్ర
  • 2 రెబ్బలు కరివేపాకు
  • ఒకట్రెండు పచ్చిమిర్చి (తరుగు)
  • ఇంగువా – చిటికెడు
  • రెండు చల్ల మిరపకాయలు (ఆప్షనల్)
  • పావు కప్పు దానిమ్మ గింజలు

విధానం

  • ముందుగా గడ్డ పెరుగు తీసుకుని నీళ్లు కలుపుకొని చిలక్కొట్టుకోవాలి. పలుచగా తయారయ్యాక కొద్దిగా ఉప్పు, పంచదార వేసుకుని కలుపుకోవాలి. తయారీకి ముందుగా గంట సేపు ఫ్రిజ్​లో పెట్టడం వల్ల చల్లచల్లగా రుచికి బాగుంటుంది.
  • ఇడ్లీ సిద్ధం కాగానే మరోవైపు పోపు కోసం టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకుని దినుసులను చక్కగా వేయించాలి.
  • ఇడ్లీని ఓ గిన్నెలోకి తీసుకుని వాటిపై పలుచని పెరుగు పొరలాగా పోసుకోవాలి.
  • పెరుగు పోసుకున్న ఇడ్లీపై తాలింపు సహా కొద్దిగా దానిమ్మ గింజలు, పచ్చి మిర్చి తరుగు చల్లుకోవాలి. పెరుగు చల్లగా అనిపించకపోతే అన్నీ కలిపిన తర్వాత ఫ్రిజ్​లో పెట్టుకున్నా సరిపోతుంది.
  • చల్ల మిరపకాయ అందుబాటులో లేకపోతే మీరు ఎండు మిర్చి కూడా వాడుకోవచ్చు.
  • దానిమ్మ గింజలతో పాటు తీపి బూందీ (ఆప్షనల్) కూడా వేసుకోవచ్చు.

మాంసాహారం మంచిదా? చెడ్డదా? - వారంలో ఎన్నిసార్లు నాన్ వెజ్ తినొచ్చో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details