తెలంగాణ

telangana

ఎప్పుడూ ఎగ్​, చికెన్​ ఫ్రైడ్​ రైసేనా? - ఈసారికి "ఆవకాయ ఫ్రైడ్ రైస్" చేసుకోండి! క్షణాల్లో అద్దిరిపోయే టేస్ట్​! - Avakaya Fried Rice

By ETV Bharat Features Team

Published : Aug 27, 2024, 11:18 AM IST

Fried Rice: ఫ్రైడ్​ రైస్​ను చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇక ఫ్రైడ్​ రైస్​లలో ఎగ్​, చికెన్​, వెజ్​.. ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. వీటన్నింటిని చాలా మంది అనేక సార్లు తినే ఉంటారు. అయితే ఎప్పుడూ ఇవే కాకుండా.. ఓసారి ఆవకాయతో ఫ్రైడ్​ రైస్​ ప్రిపేర్​ చేయండి. టేస్ట్​ అద్దిరిపోవాల్సిందే.

Avakaya Fried Rice
Avakaya Fried Rice Recipe (ETV Bharat)

How To Make Avakaya Fried Rice: చాలా మందికి ఆవకాయ అనే పదం వింటేనే నోరూరిపోతుంది. కొంతమందికి ఇంట్లో ఎన్ని కూరలు వండినా కూడా కాస్త ఆవకాయ వేసుకుని తింటేనే గానీ.. తృప్తిగా ఉండదు. ఇక వేసవి కాలం వచ్చిందంటే.. ప్రతి తెలుగు వారింట్లో కచ్చితంగా మామిడికాయ పచ్చడి పెడుతుంటారు. ఒక్కసారే సంవత్సరానికి సరిపడా ఆవకాయను జాడీల్లో పెడుతుంటారు. ఇలా ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు వారికి ఆవకాయకు విడదీయలేని బంధం ఏర్పడింది. ఇక మామిడికాయ పచ్చడిని వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే ఎంతో బాగుంటుంది. అయితే, ఈ ఆవకాయను అన్నంలో కలుపుకుని మాత్రమే కాకుండా ఫ్రైడ్​ రైస్​గా చేసుకుని తింటే నా సామి రంగ అనాల్సిందే. ఏంటి నమ్మలేకున్నారా? నిజమేనండి. ఆవకాయతో ఫ్రైడ్​ రైస్​ చేసుకుంటే రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీనిని చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. ఈ ఆవకాయ ఫ్రైడ్ రైస్​ని పిల్లల లంచ్​ బాక్స్​లోకి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం టేస్టీ ఆవకాయ ఫ్రైడ్​ ఎలా చేయాలో తెలియాలంటే, ఈ స్టోరీ పూర్తిగా చదివేయండి.

కావాల్సిన పదార్థాలు :

  • మామిడికాయ పచ్చడి - అరకప్పు
  • అన్నం - రెండు కప్పులు
  • ఎగ్స్ - 3
  • కారం - 2 టీస్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • క్యారెట్ - ఒకటి
  • ఉల్లిపాయ - ఒకటి
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీస్పూన్
  • సోయా సాస్ - అర టీస్పూన్
  • పచ్చిమిర్చి - మూడు
  • కరివేపాకు - 1
  • నూనె - 2 టేబుల్ స్పూన్లు
  • కొత్తిమీర -కొద్దిగా

ఆవకాయ ఫ్రైడ్ రైస్ రెసిపీ తయారీ విధానం :

  • ముందుగా అన్నాన్ని ఓ ప్లేట్​లోకి తీసుకుని పొడిపొడిలాడేలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆవకాయ వేసి, పూర్తిగా పచ్చడిలోని కారం అన్నానికి కలిసే వరకు చేతితో కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ రైస్​ని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్​ పెట్టి కొద్దిగా ఆయిల్​ వేయండి. తర్వాత ఎగ్స్​ బ్రేక్​ చేసి, కారం, ఉప్పు వేసి గుడ్ల మిశ్రమాన్ని వేపుకుని పక్కన పెట్టుకోండి.
  • ఇప్పుడు అదే పాన్​లో కొద్దిగా ఆయిల్​ వేసి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేపండి. తర్వాత క్యారెట్​ ముక్కలు, కరివేపాకు వేసి కొద్దిసేపు మగ్గనివ్వండి.
  • అలాగే ఇప్పుడు కొద్దిగా సోయా సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపండి. తర్వాత రెడీ చేసుకున్న ఎగ్స్​ మిశ్రమం వేసి కొద్దిసేపు కలపండి. ఇప్పుడు ఆవకాయ అన్నం వేసి కలుపుకోవాలి.
  • మీరు స్టౌ ఆఫ్​ చేసే ముందు కొత్తిమీర చల్లుకుని దించుకుంటే సరిపోతుంది. క్షణాల్లో ప్రిపేర్​ అయ్యే ఆవకాయ ఫ్రైడ్​ రైస్​ రెడీ అయిపోయినట్లే. నచ్చితే మీరు కూడా ఈ కొత్త వంటకాన్ని చేసి ఇంట్లో వాళ్లకి ప్రేమతో పెట్టండి.

ABOUT THE AUTHOR

...view details