ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

ఇడ్లీ పిండి చాలు - అమ్మమ్మల నాటి అద్దిరిపోయే "దిబ్బరొట్టె" - DIBBA ROTTI RECIPE

హెల్దీ బ్రేక్​ఫాస్ట్​ కోసం చూస్తున్నారా? - దిబ్బరొట్టె బెస్ట్​ ఆప్షన్​!

Andhra Style Dibba Rotti Recipe
Andhra Style Dibba Rotti Recipe (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2025, 2:21 PM IST

Andhra Style Dibba Rotti Recipe : సాధారణంగా చాలా మంది వారానికి సరిపడా ఇడ్లీ పిండి రుబ్బుకుని ఫ్రిడ్జ్​లో స్టోర్​ చేసుకుంటుంటారు. ఇలా ఇడ్లీ పిండిరెడీగా ఉంటే ఎప్పటికప్పుడూ చకచకా వేడివేడి ఇడ్లీ తయారు చేసుకోవచ్చు. అయితే, ఇడ్లీ పిండితో ఇడ్లీలు చేసుకోవడం కామన్​. అలా కాకుండా ఓ సారి ఈ స్టోరీలో చెప్పిన విధంగా దిబ్బరొట్టె ట్రై చేయండి. ఈ దిబ్బరొట్టె క్రిస్పీగా ఎర్రగా చూస్తేనే నోరూరిపోతుంది. పైగా దీన్ని ప్రిపేర్​ చేయడం కూడా చాలా సులభం. మరి ఇక ఆలస్యం చేయకుండా సింపుల్​గా దిబ్బరొట్టె ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • ఇడ్లీ పిండి - నాలుగు కప్పులు (సుమారు 350 గ్రాములు)
  • ఉప్పు - రుచికి సరిపడా
  • జీలకర్ర - టీస్పూన్
  • కొద్దిగా నీరు
  • నూనె

హోటల్ స్టైల్​లో రవ్వ ఊతప్పం - ఈజీగా అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చు!

తయారీ విధానం :

  • దిబ్బరొట్టె చేయడానికి అడుగు మందంగా ఉండే కాస్ట్​ ఐరన్ మూకుడు పర్ఫెక్ట్​ సరిపోతుంది. దీనిలో దిబ్బరొట్టె చేస్తే క్రిస్పీగా ఎంతో రుచికరంగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర కాస్ట్​ ఐరన్​ ముకుడు లేకపోతే మందంగా ఉండే ప్రెషర్​ కుక్కర్ ఉపయోగించవచ్చు.
  • ముందుగా 2 టేబుల్​స్పూన్ల ఆయిల్​ మూకుడులో వేసి మొత్తం స్ప్రెడ్​ చేయండి.
  • ఆపై ఒక మిక్సింగ్​ బౌల్లో ఇడ్లీ పిండి తీసుకోండి. ఇందులో ఉప్పు, జీలకర్ర, కొద్దిగా వాటర్​ యాడ్​ చేసి గరిటెతో 2 నిమిషాలు బాగా కలపండి.
  • ఇప్పుడు స్టవ్​పై ముకుడు పెట్టి 4 టేబుల్​స్పూన్ల ఆయిల్​ వేయండి.
  • తర్వాత రెడీ చేసుకున్న ఇడ్లీ పిండి మొత్తం ఒకేసారి పోసేయండి.
  • ఇప్పుడు చిన్న టీ గ్లాసులో నీళ్లు పోసి పిండి మధ్యలో ఉంచండి. ఆపై మూకుడుపై మూతపెట్టి లో ఫ్లేమ్​లో 20-25 నిమిషాలు ఉడికించుకోండి. (మధ్యలో టీగ్లాసులో నీళ్లు పెట్టడం వల్ల చక్కగా ఉడుకుతుంది. అలాగే మాడిపోవడానికి ఛాన్స్​ ఉండదు!)
  • చక్కగా ఉడికిన దిబ్బరొట్టెను అట్లకాడతో ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే స్టవ్​పై దోశ పాన్​ పెట్టంది. దీనిపై కొద్దిగా ఆయిల్​ వేసి దిబ్బరొట్టె పైభాగం ఉంచండి.
  • ఇలా దిబ్బ రొట్టె రెండు వైపులా కాల్చుకోవడం వల్ల చాలా రుచికరంగా ఉంటుంది.
  • ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి దిబ్బరొట్టె ప్లేట్లోకి తీసుకోండి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే వేడివేడి టేస్టీ దిబ్బరొట్టె మీ ముందుంటుంది.
  • ఈ దిబ్బరొట్టెను బెల్లం పానకం, కొబ్బరి చట్నీతో తింటే టేస్ట్​ అద్దిరిపోతుంది.
  • ఇడ్లీ పిండితో చేసే ఈ దిబ్బరొట్టె నచ్చితే మీరు ఓ సారి ఇంట్లో ట్రై చేయండి.

నానబెట్టడాలు, మిక్సీ పట్టడాల్లేవ్! - 10 నిమిషాల్లో కరకరలాడే రవ్వ పునుగులు

రొటీన్​ కాదు 'ప్రొటీన్'​గా చేసేద్దామా! - 'బరువు తగ్గించే దోశలు'

ABOUT THE AUTHOR

...view details