Valentine Week Ideas 2025 : వాలంటైన్స్ డే అంటే ఇంకా వారం రోజులుంది కదా అనుకుంటే కుదరదు. వారం రోజుల ముందుగానే సెలబ్రేషన్స్ జోరందుకుంటాయి. మీ ప్రేమను వ్యక్త పరిచేందుకు ఈ ఏడు రోజులు ఇలా ప్లాన్ చేయండి!
ఫిబ్రవరి వచ్చిందంటే చాలు యూత్‌కి ఏదో తెలియని ఆనందంతో ఊహలకు రెక్కలు వచ్చేస్తాయి. తమ పార్ట్నర్ను ఎంతగా లవ్ చేస్తున్నామో చెప్పేందుకు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. కొందరు ఫిబ్రవరి 14న ప్రపోజ్ చేస్తే మరికొందరు ముందునుంచే ప్రేమ పాటలు పాడుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా ఫిబ్రవరి నెల లవర్స్‌కి ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు.
![Valentines Day Tips 2025](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-02-2025/23491981_eating.jpg)
చాలా మంది ప్రేమికులు ఫిబ్రవరిలో వాలంటైన్స్ వీక్‌ను ఫాలో అవుతుంటారు. వాలంటైన్స్ వీక్ ఈ రోజున (7వ తేదీ) మొదలైంది. ఈ వాలంటైన్స్ వీక్‌లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. మొదటి రోజు రోజ్ డే, రెండవ రోజు ప్రపోజ్ డే, మూడవ రోజు చాక్లెట్ డే, నాలుగవ రోజు టెడ్డీ డే, ఐదవరోజు ప్రామిస్ డే, ఆరవ రోజు హగ్ డే, ఏడవ రోజు కిస్ డే, చివరి రోజు ఫిబ్రవరి14న వాలంటైన్స్ డేతో ఈ వాలంటైన్స్ వీక్ ముగుస్తుంది. మీ లైఫ్ మొత్తం ఈ వాలంటైన్స్ వీక్ గుర్తుండిపోవాలంటే చక్కగా ప్లాన్ చేసుకోవాలి. వాలంటైన్స్ వీక్‌ని స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ మీ కోసం.
సేమ్ టీషర్టులు :
చాలా మంది ప్రేమికులకు ఇది మొదటి వాలంటైన్స్ వీక్ కావచ్చు. మీరు ఆనందంగా గడిపిన ఈ క్షణాలు జీవితాంతం గుర్తుండాలంటే ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు ఒకే రకం టీషర్టులు ధరించండి. రెస్టారెంట్లో మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి ఎదురెదురుగా కూర్చుని భోజనం చేయండి. ఈ మధురమైన క్షణాలు మీకు లైఫ్ లాంగ్ మంచి మెమోరీగా గుర్తుండిపోతాయి.
సినిమాకు వెళ్లండి :
వాలంటైన్స్ వీక్ ప్రేమికులకు అంకితం. ఈ వారంలో మీ లవర్‌తో ఏదైనా ఒక మంచి సినిమాకు వెళ్లేలా ప్లాన్ చేసుకోండి. ఇందుకోసం ముందుగానే ఏ సినిమాకు వెళ్లాలో మీ పార్టనర్‌ని అడగండి. వారి అభిప్రాయం సేకరించి మంచి సినిమా చూసి ఎంజాయ్ చేయండి.
![Valentines Day Tips 2025](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-02-2025/23491981_park.jpg)
పెళ్లైన వారు కూడా :
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పెళ్లైన వారు కూడా తమ భాగస్వామికి ఇష్టమైన బహుమతి ఇచ్చి ప్రేమను మరింత దృఢం చేసుకోవచ్చు. వారికి ఇష్టమైన ఆహారాన్ని స్వయంగా వంటింట్లో రెడీ చేసి తినిపించవచ్చు. ఇలా మీ పార్టనర్‌కి మీ చేతులతో భోజనం వడ్డించి వాలంటైన్స్ వీక్‌ని సెలబ్రేట్ చేసుకోండి.
సాయంత్రం వేళ బీచ్‌లో:
చల్లటి సాయంత్రం వేళ మీ ప్రేయసిని బీచ్‌కు తీసుకెళ్లి వారితో ఆనందంగా గడపండి. ఒడ్డును తాకుతున్న అలలపై కాసేపు నడిచి మీ జీవితంలో మర్చిపోలేని అనుభూతిని పొందండి. బీచ్‌లు దగ్గరగా లేని వారు పచ్చని చెట్లు ఉండే వాతావరణంలో నడిచేందుకు ప్రాధాన్యం ఇవ్వండి.
చాక్లెట్లు బహుమతిగా :
ఇప్పటికే లవ్‌లో ఉన్నవారు, ప్రేమ బంధంతో ఏడడుగులు నడిచి ఒక్కటైన వారు ఈ వారంలో మీ భాగస్వామికి చాక్లెట్లు బహుమతిగా ఇవ్వండి. గతంలో ఇద్దరి మధ్య ఏర్పడిన చేదు జ్ఞాపకాలను మర్చిపోయి ఈ ఫిబ్రవరి 14 నుంచి జీవితాంతం కలిసి ఉండేలా ప్లాన్ చేసుకోండి.
కిస్ డే, హగ్ డే ఎప్పుడో తెలుసా? వాలంటైన్స్ వీక్ ప్రత్యేకతలేంటో తెలుసుకోండి!
వాలంటైన్స్ డే : టాలీవుడ్ బెస్ట్ లవ్ డైలాగ్స్ - ఇవి చెప్పి మనసు దోచేయండి బ్రదర్స్!