How to Clean Silver Articles :బంగారం తర్వాత ఎక్కువగా డిమాండ్ ఉన్న వాటిల్లో వెండి ఒకటి. చాలా మంది ఇళ్లలో వెండి గ్లాసులు, చిన్న ప్లేట్లు, దేవుడి విగ్రహాలు ఉంటాయి. దాదాపు అమ్మాయిలందరూ కాళ్లకు వెండి పట్టీలూ ధరిస్తుంటారు. ఇలా వెండి వస్తువులు, ఆభరణాలు మన జీవితంలో ఒక భాగమైపోయాయి. అయితే, సాధారణంగానే వెండి వస్తువులు కొనేటప్పుడు చూస్తే తళతళా మెరిసిపోతాయి. తర్వాత కాలమేదైనా గాలి తగలడం వల్ల కొన్ని రోజులకు అవి నల్లగా మారతాయి. గాలిలోని తేమతో జరిగే కెమికల్ రియాక్షన్ వల్ల వెండి నల్లగా మారిపోతుంది. ఫలితంగా అది మెరుపుని కోల్పోతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వెండి వస్తువులను వీలైనంత వరకు గాలి, తేమ తగలని ప్రదేశంలో భద్రపరచాలని సూచిస్తున్నారు. అయితే ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇవి నల్లగా మారి మెరుపును కోల్పోతుంటాయి. ఇలాంటప్పుడు కొన్ని టిప్స్ పాటించి తిరిగి వాటిని మెరిపించ వచ్చంటున్నారు. ఆ చిట్కాలు మీ కోసం.
టూత్‌పేస్ట్‌తో :
టూత్‌పేస్ట్‌లో ఉండే క్యాల్షియం వెండి వస్తువులను కొత్తవాటిలా మెరిపిస్తుంది. ఇందుకోసం కొద్దిగా పేస్ట్‌ని తీసుకుని దాన్ని వెండి వస్తువుపై పల్చని పొరలా అప్లై చేయాలి. టూత్‌పేస్ట్ పూర్తిగా ఆరిపోయే దాకా అలా వదిలేయాలి. అనంతరం టిష్యూ పేపర్‌తో తుడిచి నీటితో శుభ్రం చేసేయాలి. ఇలా చేస్తే అవి కొత్తవాటిలా మెరుస్తాయి. ఇలా చేసినా వెండి వస్తువుల నలుపు పూర్తిగా వదలకపోతే ఇదే పద్ధతిని మరోసారి ట్రై చేయండి!
ఉప్పు నీరు :
నల్లగా మారిన వెండి వస్తువుల్ని ఉప్పు నీళ్లతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇందుకోసం రెండు కప్పుల నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు కలపాలి. దానిలో నల్లగా మారిన వెండి వస్తువులు, పట్టీలను కాసేపు ఉంచాలి. అనంతరం మెత్తటి బ్రష్‌తో రుద్దితే నలుపు పూర్తిగా వదిలిపోయి తళతళా మెరిసిపోతాయి.