Ganesh Chaturthi 2024 Wishes : హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండగలలో ఒకటి.. వినాయక చవితి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితిని గణేష్ చతుర్థిగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుడిని పూజిస్తారు. అనేక రూపాలు.. ఆకట్టుకునే రంగుల్లో కొలువుదీరిన ఆ గణపతిని పూలతో అలకరించి.. రకరకాల పండ్లు, ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తూ.. కోరిన కోరికలు తీర్చాలని వేడుకుంటారు.
మరి.. ఈవినాయక చవితి(Ganesh Chaturthi) వేళ మీ మిత్రులు, బంధువులకు.. సింగిల్ వర్డ్‌లో "వినాయక చవితి శుభాకాంక్షలు" అని కాకుండా.. ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పండి. అందుకోసం "ఈటీవీ - భారత్" స్పెషల్ విషెస్, కోట్స్ అందిస్తోంది
"లంబోదరుడి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని.. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ.. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు."
"విఘ్నాలను తొలగించే గణనాథుడు మీ కష్టాలను తీర్చాలని.. మీ జీవితంలో సంతోషాలు వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు."
"పార్వతీతనయుడు మీకు దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ.. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!!"
"ఏకదంతుడు మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తూ.. ఎల్లప్పుడూ ప్రేమ, విజయాన్ని అనుగ్రహించాలని మనసారా ఆకాంక్షిస్తూ.. హ్యాపీ గణేష్ చతుర్థి 2024"
"ఆ గణనాథుడు మీరు కోరిన కోరికలన్నింటినీ నెరవేర్చి, అన్నింటా విజయాలను అందించాలని కోరుకుంటూ.. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు."
"ఇదొక కొత్త ఆరంభం అనుకుందాం. ఈ రోజు ఆ బొజ్జగణపయ్య ఆశీర్వాదాలు పొంది ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్థిల్లాలని వేడుకుంటూ.. హ్యాపీ వినాయక చవితి 2024"
"మట్టితో చేసిన వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.. మీకు, మీ కుటుంబ సభ్యులకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు."
"పార్వతీ తనయుడు మీకు జ్ఞానం, తెలివి, శ్రేయస్సు, ఆనందం, విజయాన్ని అందిచాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు."
"విఘ్నహర్తుడైన గణేశుడు మన జీవితాల నుంచి అన్ని అడ్డంకులను, దుఃఖాలను తొలగించాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ.. బంధుమిత్రులందరికీ హ్యాపీ వినాయక చవితి"
Ganesh Chaturthi 2024 Special Quotes :
"విఘ్నాలను తొలగించే ఏకదంతుడికి
అఖండ భక్తకోటి అందించే అపూర్వ నీరాజనం
ఓ విఘ్నేశ్వరాయ నమ:"
- అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!
"గజాననుడు మీరు చేపట్టిన పనులన్నీ
విజయవంతం అయ్యేలా చూడాలని..