తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

సూపర్ టేస్టీ "క్యాబేజీ కుర్మా" - ఓసారి ఇలా ట్రై చేయండి! - వద్దన్నవాళ్లే ప్లేట్లు నాకేస్తారు!

వాసన పడకనో, ఇంకేదైనా కారణం చేతనో క్యాబేజీని అంతగా తినడానికి ఇష్టపడరు చాలా మంది. అయితే, ఓసారి ఇలా "క్యాబేజీ కుర్మా" ట్రై చేయండి. వద్దన్నవారే మళ్లీ మళ్లీ కావాలంటారు.

By ETV Bharat Features Team

Published : 4 hours ago

How to Make Cabbage Kurma
Cabbage Kurma (ETV Bharat)

How to Make Cabbage Kurma: క్యాబేజీ.. చాలా మంది ఎక్కువగా ఇష్టపడని కూరగాయల్లో ఒకటి. ముఖ్యంగా పిల్లలైతే క్యాబేజీని చూస్తే చాలు ముఖం తిప్పుకుంటారు. మరి, దాన్ని కూడా నోరూరించేలా చేయాలంటే.. ఇలా ఓసారి క్యాబేజీ కుర్మా ట్రై చేయండి. దీన్ని చపాతీ, రోటీ, పుల్కా, పులావ్.. దేనిలోకి తిన్నా చాలా రుచికరంగా ఉంటుంది! ఇంతకీ.. క్యాబేజీ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • క్యాబేజీ - 1
  • బంగాళదుంప - 1(మీడియం సైజ్​)
  • ఉల్లిపాయ - 1
  • టమాటాలు - 2
  • నూనె - 3 టేబుల్​స్పూన్లు
  • జీలకర్ర - అర టీస్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - అర టీస్పూన్
  • కారం - తగినంత
  • ధనియాల పొడి - 1 టీస్పూన్
  • గరం మసాలా - అర టీస్పూన్
  • కసూరి మేతి - 1 టీస్పూన్
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

మసాలా పేస్ట్​ కోసం :

  • దాల్చిన చెక్క - అంగుళం ముక్క
  • లవంగాలు - 3
  • పచ్చికొబ్బరి ముక్కలు - పావు కప్పు
  • పచ్చిమిర్చి - 2
  • మిరియాలు - అర టీస్పూన్
  • పుదీనా ఆకులు - కొన్ని

వెడ్డింగ్​ స్టైల్​​ క్యాబేజీ 65 - ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే సూపర్​ క్రిస్పీ అండ్​ టేస్ట్​ గ్యారెంటీ!​

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్​ పరిమాణంలో క్యాబేజీని(Cabbage) తరుక్కొని పక్కన ఉంచుకోవాలి. అలాగే.. బంగాళదుంపను పొట్టు తీసి గ్రేటర్ సహాయంతో సన్నని తురుములా తరుక్కొని గిన్నెలో వాటర్​లో వేసి పక్కన పెట్టుకోవాలి.
  • అదేవిధంగా.. ఉల్లిపాయ, పండిన టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక.. జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఆనియన్స్ కాస్త మెత్తబడే వరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక.. ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కలుపుకోవాలి. ఆపై టమాటా ముక్కలు తొందరగా మెత్తబడడానికి ఉప్పు కూడా వేసుకొని కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత మూత తీసి చూస్తే టమాటా ముక్కలు బాగా మగ్గిపోయి ఉంటాయి. అప్పుడు వాటన్నింటినీ గరిటెతో ఒకసారి వత్తుకుంటే మంచి గుజ్జులా అయిపోతాయి.
  • అనంతరం.. అందులో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత.. క్యాబేజీ తరుగు, బంగాళదుంప తురుమును నీళ్లు లేకుండా పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆపై మూతపెట్టి లో ఫ్లేమ్ మీద కాసేపు ఉడకనివ్వాలి.
  • ఆలోపు కొబ్బరి మసాలా పేస్ట్​ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం.. మిక్సీ జార్​ తీసుకొని అందులో దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చికొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, మిరియాలు, పుదీనా వేసుకున్నాక కాసిన్ని వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై ఉన్న క్యాబేజీ మిశ్రమం చక్కగా మగ్గిందనుకున్నాక.. అందులో గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా కొబ్బరి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఆపై స్టౌను లో ఫ్లేమ్​లో ఉంచి కలుపుతూ 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక.. అందులో సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. తర్వాత మూతపెట్టి స్టౌను మీడియం ఫ్లేమ్ మీద ఉంచి 5 నిమిషాల పాటు మిశ్రమంలో ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి.
  • అలా ఉడికించుకున్నాక.. మూత తీసి కసూరి మేతి వేసుకొని కలిపి కాస్త చిక్కటి గ్రేవీ వచ్చేంత వరకు మరోసారి ఉడికించుకోవాలి.
  • ఆవిధంగా ఉడికిందనుకున్నాక.. చివరగా కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి దింపుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "క్యాబేజీ కుర్మా" రెడీ!

పిల్లలు క్యాబేజీ తినట్లేదా? - గుడ్లతో ఇలా ఎగ్​బుర్జీ చేయండి - మెతుకు మిగల్చకుండా తినేస్తారు!

ABOUT THE AUTHOR

...view details