Benefits of Rosemary :రోజ్‌మేరీ- పుదీనా కుటుంబానికి చెందిన ఆకర్షణీయమైన, అందమైన చిన్న పొద ఇది. దీనిని ఎక్కువగా విదేశీ వంటల్లో కొత్తిమీరకు బదులుగా ఉపయోగిస్తారు. ప్రధానంగా నాన్వెజ్ రెసిపీల్లో, బ్రెడ్-సూప్స్ తయారీలో, సలాడ్లలోనూ దీన్ని విరివిగా వాడతారు. దీంతో హెర్బల్ టీకూడా ప్రిపేర్ చేస్తారు. ఈ నేపథ్యంలో రోజ్‌మేరీతో కలిగే లాభాలను తెలుసుకుందాం.
రోజ్ మేరీతో లాభాలు :
- రోజ్ మేరీ ఆకుల వాసన ఉల్లాసాన్నీ ఉత్సాహాన్నీ అందిస్తుంది. కాసేపు ఈ సువాసన పీల్చడం వల్ల ఉద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
- రోజూ 4 నుంచి 10 నిమిషాలు ఈ వాసన పీల్చడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, మానసిక ఒత్తిడి తగ్గుతుందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
- రోజ్ మేరీ వాటర్ తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అలాగే కడుపుబ్బరం తగ్గుతుంది. ఇంకా ఊబకాయం రాదట.
- మన శరీరానికి సి-విటమిన్ అధికంగా లభిస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే నోటిపూత రాదు.
- రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండెజబ్బులు వచ్చే ఛాన్స్ తగ్గుతుందట.
- ఇందులో యాంటీబ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాలున్నాయి.
- మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
- కళ్లకు రక్షణ ఇస్తుంది. ఇంకా చూపు మెరుగవుతుంది. జుట్టు రాలకుండా ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణలు చెబుతున్నారు.
రోజ్ మేరీ వాటర్ ఇలా చేయాలి :
కావాల్సిన పదార్థాలు :
- నీళ్లు - లీటరు
- 3 రోజ్‌మేరీ రెమ్మలు
- 2 నిమ్మ చెక్కలు
తయారీ విధానం :
- ముందుగా ఒక బౌల్లో లీటర్ నీళ్లు పోయండి. ఇందులో రోజ్‌మేరీ రెమ్మలు, నిమ్మ చెక్కలు వేయండి.
- ఆపై దీనిని రెండు గంటలు ఫ్రిజ్‌లో ఉంచండి. అనంతరం వడకట్టేసి తాగితే సరిపోతుంది.