Elbow Darkness Removal Tips :చాలా మందికి మోచేతి భాగంలో నల్లగా, మురికిగా ఉంటుంది. ఈ కారణంతో ఇబ్బందిగా ఫీలవుతూ నలుగురిలో వాటిని దాచేసే ప్రయత్నం చేస్తుంటారు. అయితే నల్లగా, మురికిగా ఉన్నా వాటిని తిరిగి మృదువుగా మార్చుకునే అవకాశాలున్నాయి. వంటింట్లో దొరికే పదార్థాలతో సింపుల్ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. అవేంటో తెలుసుకుందాం.
నల్లగా, మురికిగా కనిపించే మోచేతులు అందాన్ని దెబ్బతీయడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. దుమ్మతో పాటు మెలనిన్ పేరుకుపోవడం వల్ల మోచేతులు నల్లగా మారుతాయి. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ముఖ్యం.
అల్యూమినియం పాత్రల్లో వంట ప్రమాదకరమా? - డాక్టర్లు ఏం చెప్తున్నారంటే!
తేనె, నిమ్మకాయ
సహజసిద్ధంగా లభించే నిమ్మకాయ బ్లీచింగ్ ఏజెంట్ గా చక్కగా పనిచేస్తుంది. తేనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఈ రెండింటిని కలిపి మోచేతులపై రాసుకుంటే సరి. ముందుగా నిమ్మకాయను కోసి, దానికి కొన్ని చుక్కల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులపై రాసి పది నిమిషాల పాటు అలాగే ఉంచి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో మూడు నాలుగు సార్లు ఇలా చేస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది.
పాలు, బేకింగ్ సోడా
చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించడంలో బేకింగ్ సోడా సహాయపడుతుంది. అదే విధంగా ఆవుగ, గేదె పాలు సహజ మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతాయి. ఒక స్పూన్ బేకింగ్ సోడాలో పాలు కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులపై లేయర్‌గా రుసుకుని 5 నిమిషాల పాటు సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుని మాయిశ్చరైజర్ రాస్తే సరి. వారానికి రెండు మూడు సార్లు ఈ పద్ధతి ఫాలో చేసి చూడండి.
పిల్లల షూ ఎలా క్లీన్ చేయాలి? - వాషింగ్ మిషన్‌లో వేయొచ్చా!
నూనె, పంచదార
చర్మానికి తేమను అందించడంలో కొబ్బరి నూనె చక్కగా ఉపయోగపడుతుంది. అదే విధంగా చక్కెర కూడా మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ రెండింటిని కలిపి రాసుకుంటే మచ్చలు తొలగిపోయే అవకాశం ఉంది. ఒక టీస్పూన్ కొబ్బరి నూనెలో చిటికెడు చక్కెర కలిపి మిశ్రమాన్ని తయారు చేయాలి. దీనిని మోచేతులపై కొద్దిసేపు మర్దనా చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.
కలబంద జెల్
ఆరోగ్య రహస్యాల్లో కలబందకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కలబంద జెల్ యాంటీఆక్సిడెంట్, మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి చర్మాన్ని శుభ్రంగా, మృదువుగా ఉంచుతుంది. కలబంద జెల్ మోచేతులపై రాసుకుని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది. మీకు వీలున్నపుడల్లా ఇలా చేస్తే మోచేతుల నలుపు పోతుంది.
ఆలుగడ్డలు
ఆలుగడ్డల్లో బ్లీచింగ్ లక్షణాలు చర్మాన్ని తెల్లగా ఉంచడంలో సహాయపడతాయి. బంగాళాదుంప ముక్కలతో మోచేతులపై, మచ్చలున్న చోట 10 నిమిషాలు రుద్దితే సరి. కాసేపటి తర్వాత నీటితో శుభ్రం చేసుకుని మాయిశ్చరైజర్ రాసుకుంటే మచ్చలు మాయమే. తరచూ ఇలా చేయడం వల్ల స్పష్టమైన తేడా కనిపిస్తుంది.
ముఖ్యమైన చిట్కాలు
చర్మం పొడిబారకుండా ప్రతిరోజూ మోచేతులను మాయిశ్చరైజ్ చేయాలి. ఎండలో బయటకు వెళ్లేటపుడు నల్లబడకుండా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. చర్మం లోపలి వరకూ ఆరోగ్యంగా ఉండేలా తరచూ నీళ్లు తాగాలి.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రూ.40కోట్లు పలికిన 'నెల్లూరు ఆవు' - బహిరంగ వేలంలో ప్రపంచ రికార్డు
'90's కిడ్స్' ఫేవరెట్ ఐటమ్ ఇది - ఈ తరం పిల్లలకు మీ చేతులతో తయారు చేసి పెట్టండి