What To Eat When Stomach Is Upset :కడుపు నొప్పి అనేది సాధారణంగా అందరికీ వచ్చే సమస్యే. అయినప్పటికీ ఇది కొందరినీ తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని ఆహార పదార్థాలను తినడం వల్ల మనకు మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే కడుపు నొప్పి సమయంలో కొన్ని ఆహారాలు తినడం వల్ల నొప్పి మరింత తీవ్రమవుతుంది. ముఖ్యంగా ఉదరకుహర వ్యాధి, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ వంటి దీర్ఘకాలిక సమస్యలున్న వారు తరుచుగా పొత్తికడుపులో నొప్పి, వికారం, గ్యాస్, ఉబ్బరం, మలబద్దకం లేదా అతిసారం వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. అలాంటి వారు ఎలాంటి ఆహార పదార్థాలు తింటే మంచిది? ఏయే ఆహారాలను పూర్తిగా నివారించాలి?
అల్లం
కడుపులో నొప్పితో పాటు వికారం, వాంతులు వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి అల్లం చాలా బాగా సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో వచ్చే వికారం నుంచి కూడా అల్లం ఉపశమనం కలిగిస్తుంది. దీన్ని పచ్చిగా తిన్నా, టీలో వేసుకున్నా, వంటల్లో వేసుకున్నా కడుపు నొప్పి సమస్యకు చెక్ పెడుతుంది.
చమ్మోలీ
కడుపునకు విశ్రాంతినిచ్చే శక్తి చమ్మోలీకి బాగా ఉంది. కడుపులో అసౌకర్యం, వాంతులు వంటి ఇబ్బందుల నుంచి చమ్మోలీ మిమ్మల్ని రక్షిస్తుంది. పిల్లల్లో అరుగుదల, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలకు కూడా చమ్మోలీ మంచి ఔషధంగా పనిచేస్తుంది.
పిప్పరమింట్
పుదీనా జాతికి చెందిన మూలికే ఈ పిప్పరమింట్. కడుపులో నొప్పి, ఉబ్బరం, అతిసారం సహా ప్రకోప ప్రేగు సిండ్రోమ్ వల్ల కలిగే ఇబ్బందుల నుంచి కూడా పిప్పరమింట్ మంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే యాసిడ్ రిఫ్లక్స్, కిడ్నీలో రాళ్లు, కాలేయం లేదా పిత్తాశయ రుగ్మతలు వంటి సమస్యలు ఉన్నవారు దీన్ని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
లికోరైస్
తియ్యటి రుచిని కలిగిన లికోరైస్ సాధారణంగా అజీర్ణానికి నివారణగా పనిచేస్తుంది. కడుపులో అల్సర్, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి లికోరైస్ చక్కటి ఔషధంగా పనిచేస్తుంది.
అవిసె గింజలు
ప్రేగుల కదలికలను నియంత్రించడంలో అవిసె గింజలు బాగా సహాయపడతాయి. కడుపు నొప్పిని, మలబద్దకాన్ని తగ్గించే శక్తి వీటికుంది. వీటిలో కొవ్వు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది కనుక అజీర్ణం, వికారం, వాంతులతో బాధుపడుతున్న వారు వీటిని తినకపోవడమే మంచిది.