తెలంగాణ

telangana

ETV Bharat / health

రాత్రి 7 గంటల తర్వాత ఏం తినాలో? ఏం తినకూడదో మీకు తెలుసా?

What To Eat And Not To Eat After 7pm : ఆయుర్వేదం ప్రకారం మనం తీసుకునే ఆహారం మనకు కొన్నిసార్లు అమృతం లాగా మరికొన్నిసార్లు విషంగా పని చేస్తుంది! అందుకే ఆహారం పట్ల సరైన జాగ్రత్తలు పాటించకపోతే ఆరోగ్యపరంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయుర్వేదం ప్రకారం రాత్రి 7 గంటల తర్వాత తినకూడని ఆహారాలు ఏంటో, తినగలిగే ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

What To Eat And Not To Eat After 7pm
What To Eat And Not To Eat After 7pm

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 4:31 PM IST

What To Eat And Not To Eat After 7pm :మన శరీరానికి శక్తి కావాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ఆహారం తప్పనిసరి. అయితే మనం తీసుకునే ఆహారమే మనకు అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే అవకాశం కొన్నిసార్లు ఉంటుంది. అయితే మనం ఆహారంతో ముడిపడిన నాలుగు అంశాలను పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముందుగా పాటించాల్సిన నియమం ఆహారాన్ని సమయానికి తినడం. చాలామంది ఆహారం తీసుకునేందుకు సరైన సమయాన్ని పాటించరు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అలాకాకుండా నిర్ణీత సమయానికి ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

లిమిట్​లెస్​ బ్రేక్​ఫాస్ట్​ చేయండి
మనం ఉదయం పూట తీసుకునే అల్పాహారం (బ్రేక్​ఫాస్ట్)​ అనేది ఎంతో కీలకం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అల్పాహారం కింద తీసుకోవాలి. ఉదయం నుంచి శరీరం పని చేసేందుకు సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఆహారం మీద ఎలాంటి పరిమితులు పాటించాల్సిన అవసరంలేదు. ఇక మధ్యాహ్నం ఎలాంటి నియమాలు లేకుండా కడుపునిండా భోజనం చేస్తే సరిపోతుంది.

కానీ సాయంత్రం స్నాక్స్​, రాత్రి భోజనం విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. తేలికపాటి ఆహారాలను సాయంత్రం, రాత్రి తీసుకుంటే సరిపోతుంది. అయితే ఆహారం తీసుకునే విషయంలో ఆయుర్వేదంలో అనేక జాగ్రత్తలను వివరించారు. రాత్రి 7 గంటల వరకు తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటి? తీసుకోకూడని ఆహారాలు ఏంటనే విషయాలను ఆయుర్వేద శాస్త్రంలో కూలంకశంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయుర్వేదం ప్రకారం తినకూడని ఆహారాలు ఏంటో, తినాల్సిన ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయుర్వేదం ప్రకారం తినకూడని ఆహారాలు

  • ఫ్రై చేసిన ఆహారాలు :రాత్రి 7 గంటల వరకు శరీరానికి భారీగా అనిపించే ఆహారాల జోలికి వెళ్లకూడదు. అలాగే ఎక్కువ నూనె, ఎక్కువ కారం ఉండే వాటి జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. ఎందుకంటే ఈ ఆహారాలు జీర్ణశక్తిని ప్రభావితం చేస్తాయి. చాలావరకు ఈ ఆహారాలు జీర్ణం కావు. దీంతో ఎసిడిటీ సమస్యతో పాటు గుండెలో నొప్పిగా అనిపించవచ్చు.
  • ఫ్రిజ్‎లో నిల్వ ఉంచిన ఆహారాలు :చాలామంది రాత్రిపూట ఫ్రిజ్‎లో నిల్వ ఉంచిన ఐస్ క్రీం, కోల్డ్​ కాఫీలాంటి వాటిని తీసుకుంటూ ఉంటారు. ఆయుర్వేదం ప్రకారం వీటిని అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
  • ప్రాసెస్డ్​​, ప్యాకేజ్ ఆహారాలు :ప్యాక్ చేసిన ప్రాసెస్డ్​ ఆహారాల జోలికి రాత్రి 7 దాటిన తర్వాత అస్సలు వెళ్లకండి. ఇవి ఆరోగ్యానికి చేటు చేస్తాయి.
  • తీపి పదార్థాలు :చాలామందికి రాత్రిపూట తియ్యగా ఏదైనా తినే అలవాటు ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు అని ఆయుర్వేదంలో వివరించారు. తీపిలో ఎక్కువగా చక్కెర ఉంటుందని, ఇది శరీరం మీద దుష్ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది. అలాగే పాల ఉత్పత్తులు కూడా తీసుకోకూడదు.
  • ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు : ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాల జోలికి రాత్రిపూట అస్సలు వెళ్లకూడదు. వీటిలో సోడియం ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి కీడు జరుగుతుంది.

ఆయుర్వేదం ప్రకారం తినగలిగినవి

  • తక్కువ కార్బోస్​ కలిగిన ఆహారాలు : రాత్రి 7 గంటల వరకు తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాలు తినడం వల్ల త్వరగా జీర్ణం అవుతాయి.
  • ఫైబర్​ ఎక్కువగా ఉన్న ఆహారాలు :రాత్రిపూట ఎక్కువ ఫైబర్​ కలిగిన ఆహారాలను తినడం వల్ల అవి శరీరానికి మేలు చేస్తాయి.
  • ప్రోబయోటిక్స్ : శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియాను పంచే ప్రోబయోటిక్స్‎న్​ను తీసుకోవడం వల్ల జీర్ణాశయానికి మేలు కలుగుతుంది.
  • ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు :శరీరానికి కావాల్సిన వాటిలో ప్రోటీన్లు కూడా కీలకం. ఎక్కువ ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని రాత్రిపూట తీసుకోవడం వల్ల శరీరానికి మంచి జరుగుతుంది.

చివరగా రాత్రిపూట ఏం తిన్నా మితంగా తినాలని ఆయుర్వేదంలో చెప్పారు. మితాహారం తీసుకోవడం వల్ల జీర్ణాశయం మీద తక్కువ ప్రభావం పడుతుంది. తద్వారా శరీరం సరిగ్గా పని చేస్తుందని ఆయుర్వేదం స్పష్టం చేస్తుంది.

ముఖ్య గమనిక :ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నీళ్లు తక్కువ తాగితే కిడ్నీలకు డేంజర్ - మరి ఎక్కువగా తాగితే?

మద్యం తాగే ముందు ఇవి తినండి - ఆరోగ్యం సేఫ్​గా ఉంటుందట!

ABOUT THE AUTHOR

...view details