Side Effects of Mobile Phones on Women Health : ఈ నేటి టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌ను.. తమ ఆత్మీయ తోడుగా మార్చుకున్నారు! తిండీ తిప్పలు మానేసి అదే పనిగా గంటలు గంటలు మొబైల్ఫోన్తోనే కాలం గడుపుతున్నారు. అన్ని వయసుల వారూ ఇలా తయారయ్యారు. అయితే.. దీని ప్రభావం మహిళల్లో ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు ఒకే పొజిషన్లో కూర్చొని మొబైల్ యూజ్ చేయడం వల్ల, వారిలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇంతకీ.. మహిళలు అధికంగా ఫోన్(Mobile) వాడడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
స్మార్ట్‌ఫోన్లు బ్లూ లైట్ రిలీజ్ చేస్తాయి. ఇది మన సిర్కాడియన్ రిథమ్‌కు అంతరాయం కలిగించడంతో పాటు.. మెలటోనిన్ ఉత్పత్తిని అణచివేస్తుంది. ఇది నిద్రను నియంత్రించే హార్మోన్ కావడం వల్ల.. మహిళల్లో నిద్రకు అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా నిద్రలేమి సమస్య తలెత్తుతుందట. అంతేకాదు.. ఇది కంటి సమస్యలతో పాటు అనేక అనారోగ్య సమస్యలకూ దారితీయవచ్చంటున్నారు నిపుణులు.
మహిళలు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ యూజ్ చేయడం వల్ల.. గర్భాశయ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తరచుగా ఒకే పొజిషన్లో ఎక్కువసేపు మొబైల్ వాడడం వల్ల గర్భాశయ ఎముకలకు సంబంధించి సమస్యలు వస్తాయని సూచిస్తున్నారు. అలాగే భుజాలు, మెడ, తల నొప్పి కలిగిస్తుందంటున్నారు. ఇది దిగువకు వ్యాపించి గర్భాశయ నొప్పికి కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు గర్భాశయ నొప్పి చాలా తీవ్రంగా మారవచ్చని.. ఆ టైమ్‌లో లేవడం, కూర్చోవడం, పని చేయడం కూడా కష్టంగా మారుతుందని నిపుణులు అంటున్నారు.
అలర్ట్ : మొబైల్ పక్కనే పెట్టుకొని నిద్రిస్తున్నారా? - మీకు ఏం జరుగుతుందో తెలుసుకోండి!