These Beauty Products You Should Never Share :కొంత మంది మహిళలు తమ బ్యూటీ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకుంటూ ఉంటారు. లిప్‌స్టిక్ నుంచి మేకప్ బ్రష్ దాకా అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే.. ఇలా చేయడం వల్లచర్మానికి(Skin) హాని కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి.. ఏయే ఉత్పత్తులను ఇతరులతో పంచుకోకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
లిప్‌స్టిక్/ లిప్‌గ్లాస్ :చాలా మంది మహిళలు ఎక్కువగా చేసే పొరపాటు ఏంటంటే.. రంగు బాగుందనో లేక మంచి లుక్ ఇస్తుందనో ఇతరుల లిప్‌స్టిక్/ లిప్‌గ్లాస్ యూజ్ చేస్తుంటారు. అయితే.. మీకు ఇలాంటి అలవాటు ఉంటే ఇప్పుడే మానుకోవాలంటున్నారు నిపుణులు. ఇతరులవి యూజ్ చేసినప్పుడు వాటిపై ఉన్న బ్యాక్టీరియా మీ పెదవుల పైకి చేరే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.
"Journal of the American Academy of Dermatology" అనే జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. లిప్‌గ్లాస్‌ను పంచుకునే యువతులు ఇతరుల కంటే పెదాల ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం 6 రెట్లు ఎక్కువ అని కనుగొన్నారు. ఈ పరిశోధనలో శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ జె. ఓల్గా లోజ్ పాల్గొన్నారు. లిప్‌గ్లాస్ పంచుకునే వారు.. హెర్పెస్ సింప్లెక్స్ వైరస్(HSV) 1, హెచ్ఎస్వీ 2, స్టాఫిలోకాకస్ ఆరియస్ వంటి బ్యాక్టీరియాతో సహా పెదాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని లోజ్ పేర్కొన్నారు.
పౌడర్ రూపంలో ఉండే ప్రొడక్ట్స్ : కొంతమంది మహిళలు పౌడర్ రూపంలో ఉండే మేకప్‌లో ఉపయోగించే ఫౌండేషన్, ఐ షాడో.. వంటివి షేర్ చేసుకుంటుంటారు. అయితే, వీటిని ఒకరి కంటే ఎక్కువమంది చేతితో తాకినా లేదా బ్రష్‌తో అప్త్లె చేసుకున్నా అందులో బ్యాక్టీరియా చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. ఫలితంగా మొటిమలు రావడం, చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు దరిచేరడం.. వంటి సమస్యలు రావచ్చొంటున్నారు.
డైలీ ఈ ఫేస్‌ప్యాక్‌లు ట్రై చేశారంటే- మేకప్ లేకుండానే మెరిసిపోవచ్చు!