ROASTED CHANA BENIFITS :ఆరోగ్యవంతమైన శరీరానికి పోషకాహారం తప్పనిసరి. దైనందిన సమతుల ఆహారంలో ఆకుకూరలు, పప్పుదినుసులు, బీన్స్(చిక్కుడు), పాలు, పెరుగులాంటి పాల ఉత్పత్తులతో పాటు మాంసం, గుడ్లు ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, పండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ తీసుకోవాలి. అయితే పలు రకాల చిరుతిళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చిరుతిళ్లు అనగానే ఒక రకమైన చెడు అభిప్రాయం ఉంది గానీ, శరీరానికి అవి చేసే మేలు అంతా ఇంతా కాదు. చిరుతిళ్లు అంటే స్వల్పం అని, అంతేగాని చిరుతిళ్లను కూడా భోజనంలా తీసుకుంటే ఇబ్బందులు తప్పవు.
కాల్చిన శనగ(చనా) ప్రోటీన్ కంటెంట్ కండరాల మరమ్మతు, పెరుగుదలకు తోడ్పడుతుందని ఫిజిషియన్లు సూచిస్తున్నారు. మధుమేహ బాధితులకు కాల్చిన శనగలు దేవుడు ఇచ్చిన వరమే అని చెప్పుకోవాలి. శనగల్లోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియలో సహాయపడడంతో పాటు జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది. వీటిలో లభించే B విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీర ధారుడ్యానికి సహకరిస్తాయి. శరీరానికి అవసరమైన ఫైబర్ అందించడంతోపాటు కు తక్కువ గ్లైసెమిక్ లక్షణాన్ని కలిగి ఉన్నాయని గుండె వైద్య నిపుణులు డాక్టర్ సోమరాజు వెల్లడించారు.
ధనియాల కషాయం సీక్రెట్ తెలిస్తే అస్సలు వదలరు- ఇలా చేయండి ఆశ్చర్యపోతారు! - coriander health benefits
కాల్చిన శనగల్లో గుండె జబ్బులను నివారించడంలో సహాయపడే విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, ఐరన్, సెలీనియం, మాంగనీస్, కాల్షియం, కాపర్, జింక్, పొటాషియం కావల్సిన మోతాదులో లభిస్తాయి. రక్తం గడ్డకట్టడాన్ని తగ్గించడంతో పాటు అవయవాలకు రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తాయి. గుండె లయను కాపాడడంలో సహకరిస్తాయి. మలబద్ధకాన్ని నివారించే ఫైబర్ మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రీ ప్రోబయోటిక్ కంటెంట్ గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. - సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ సోమరాజు