Oil Bottles Vs Oils Sprays : భారతీయుల తమ వంటగదుల్లో తరతరాలుగా వాడుతూ ఉన్న నూనె డబ్బాలను మార్చమంటే ఒప్పుకుంటారా? వాటికి బదులుగా లేటెస్ట్‌గా నూనె స్ప్రేలు చేసుకునే పరికరాలను ఉపయోగించమంటే ఏం చేస్తారు? కచ్చితంగా సందిగ్దంలో పడిపోతారు. కానీ, ఈ విషయం తెలిసిన వారందరికీ మాత్రం ఒక క్లారిటీ వచ్చేస్తుంది. వాస్తవానికి మన ఆరోగ్యం విషయంలో ఇది ఒక గేమ్‌ఛేంజర్ కూడా. రీసెంట్‌గా ఒక ఇంగ్లీష్ మీడియాలో పబ్లిష్ అయిన కథనంలో ప్రముఖ న్యూట్రిషియన్ దీనిపై వాస్తవాలను వెల్లడించారు.
చాలా మంది వంట చేసేవారు తమ వంటకాల్లో కొలత లేకుండానే నూనెను పోసేస్తూ ఉంటారు. అలా వంట అయిపోయాక కూడా అది మిగిలిపోతే దానిని వేరే వంటకాలకు వినియోగిస్తుంటారు. ఇంకా కూరలు చేసే సందర్భాల్లో అయితే నూనె ఎక్కువైనప్పటికీ అలానే వదిలేస్తుంటారు. ఇలా చాలా వరకూ పోషకాలు కోల్పోయిన నూనెలను తిరిగి వంట చేసుకోవాల్సి రావడం వల్ల శరీరంలోకి అదనపు కొవ్వును చేర్చుకున్నట్లు అవుతుంది. పైగా రెగ్యూలర్‌గా కిచెన్లలో ఉండే వంట డబ్బాలు నెలల తరబడి క్లీన్ చేయకుండా ఉండిపోతాయి. ఫలితంగా వాటిల్లో పేరుకుపోయిన దుమ్ము ధూళి కొద్ది రోజుల పాటు వంటల్లో భాగమైపోతుంది.
కానీ, నూనె స్ప్రేలు అలా కాదు. వాడటానికి వీలుగానూ, కావాల్సిన మేరకే ఆయిల్ పోసేందుకు బాగా అనుకూలిస్తుంది. ఫలితంగా నూనె వేస్ట్ అవడమే కాకుండా సరిపడా ఆయిల్ మాత్రమే మనం ఆహారంలో చేర్చుకోగలుగుతాం. నూనె బాగా దట్టించి డీప్ ఫ్రైలు చేసుకుని క్యాన్సర్ బారినపడే ప్రమాదం నుంచి సురక్షితంగా ఉండగలం.