Menopause Skin Care Tips :ప్రతి మహిళ లైఫ్‌లో మెనోపాజ్ సహజం. నార్మల్‌గా 40-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ దశకు చేరుకుంటారు. కొందరిలో 40ల్లోపే ఈ ప్రక్రియ జరుగుతుంది. దీన్ని 'ప్రిమెచ్యూర్ మెనోపాజ్'గా పిలుస్తారు. ఏదేమైనా ఈ స్టేజ్‌లోకి ప్రవేశించే క్రమంలో మహిళల్లో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి.
వయసు పెరిగే కొద్దీ మహిళలను కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఈ క్రమంలోనే మెనోపాజ్ దశ మొదలైనప్పటి నుంచి చర్మం బాగా పొడిబారుతుంది. ముడతలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. దీంతో మహిళలు ఒక్కసారిగా వృద్ధురాలిని అయిపోయానని చాలా బాధపడుతుంటారు. అయితే, కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ముడతలను అదుపు చేయవచ్చని ప్రముఖ సౌందర్య నిపుణులు డాక్టర్ శైలజ సూరపనేని చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం.
మెనోపాజ్ దశలో చర్మం సాగడం, గీతలు, ముడతలు సర్వసాధారణం. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడంతో ఇలా శరీరంలో మార్పులు వస్తాయి. ఈ దశలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా వివిధ రకాల ఆరోగ్య సమస్యలుచుట్టుముడతాయి. అయితే, దీనిని పూర్తిగా ఆపలేం. కానీ, కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల కొంతవరకూ అదుపు చేయగలం. చాలా మంది మహిళలు ఈ వయసులో ఇవన్నీ ఎందుకు అని లైట్ తీసుకుంటారు. అలా అనుకోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ శైలజ సూరపనేని సూచిస్తున్నారు.
"రోజూ క్రీమ్ ఆధారిత మైల్డ్ క్లెన్సర్లు, మాయిశ్చరైజర్లను ఉపయోగించాలి. ఎక్కువ వేడినీటి స్నానం చేయకూడదు. మెనోపాజ్‌కు ముందూ వెనకా ఎండలో ఎక్కువగా తిరిగినా ముడతలు మరింత అధికంగా కనిపిస్తాయి. ఇవి కొద్దిమొత్తంలో ఉంటే క్రీములతో అదుపు చేయొచ్చు. అయితే ఆలిగో పెప్టైడ్లు, హైడ్రాక్సీ యాసిడ్లు, హైలురోనిక్ యాసిడ్, కాపర్ పెప్టైడ్లు, విటమిన్ సి ఉండేలా చూసుకోవాలి." - డాక్టర్ శైలజ సూరపనేని (సౌందర్య నిపుణులు)
ఇంజెక్షన్లతో :