Timings Of Meals For Diabetic Patients : ఉదయం స్నాక్స్ తీసుకోవడం వల్ల మధుమేహం ఉన్నవారికి ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. సరైన మోతాదులో అల్పాహారం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందంటున్నారు. ఉదయం ల్పాహారం అనంతరం మధ్యహ్నాం, రాత్రి భోజనం విషయంలో నియంత్రణ అవసరమంటున్నారు. తద్వారా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని సూచిస్తున్నారు. సరైన సమయంలో అల్పాహారం తీసుకోకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. తద్వారా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఎన్నిసార్లు తినాలి? : టైప్-2 డయాబెటీస్‌తో బాధపడే వారు శరీరంలో బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుదని వైద్యులు సూచిస్తున్నారు. రోజు మొత్తంలో కొద్ది కొద్దిగా శరీరానికి కార్బోహైడ్రేట్లను అందేలా చూడాని పేర్కొంటున్నారు. లంచ్, డిన్నర్లలో ఒక్కసారే భోజనం లాగిస్తే రక్తంలో షుగర్ స్థాయి పెరుగుతుందని, షుగర్ మందులు తీసుకున్నా సరే పరిస్థితి అదుపులో ఉండదని వైద్యులు తెలుపుతున్నారు. డయాబెటీస్‌తో బాధపడేవారు రోజు మొత్తంలో సరైన మొతాదులో శరీరానికి కార్బోహైడ్రేట్లు అందేలా చూసుకోవాలంటున్నారు. అంటే, ఒకేసారి పూర్తిగా శరీరానికి సరిపడ భోజనం చేయకుండా, తక్కువ పరిమాణంలో కొంచెం కొంచెం ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. మూడు పూటలా ఎక్కువ ఆహారాన్ని తీసుకొనేవారికి రోజంతా కడుపు నిండుగా ఉంటుందని, ఫలితంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వైద్యులు గుర్తించారు.
2018లో 'డయాబెటీస్ అండ్ మెటబొలిజం'లో ప్రచురించిన ఓ కథనం ప్రకారం... రోజంతా కొంచెం కొంచెం ఆహారాన్ని తీసుకోవడం వల్ల డయాబెటీస్ రోగులకు చాలా మంచిదని తేలినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. రోజంతా ఎక్కువగా తినేయకుండా కొద్ది కొద్దిగా ఆహారం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని వైద్యులు గుర్తించారు. తద్వారా అధిక గ్లూకోజ్ రక్తంలో చేరకుండా ఉంటుందని తెలిపారు.
ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? : రోజంతా కొద్దిగా కొద్దిగా ఆహారాన్ని తీసుకోవాలన్నారని, చిల్లర తిండ్లు తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. కేవలం మీ శరీరానికి పోషకాలను అందించే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలంటున్నారు. పండ్లు, ధాన్యాలు, కూరగాయలు, కొవ్వు తక్కువ మోతాదులో ఉండే ఆహారం, పాల ఉత్పత్తులు మాత్రమే ఆహారంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆహారం తినకుండా ఉపవాసాలు చేయకూడదని వైద్యులు అంటున్నారు. ''ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌ను మానకూడదు. రోజు ప్రారంభంలో మనం తీసుకొనే ఆహారమే జీవక్రియను పెంపొందిస్తుంది. శరీరం వేడి కాకుండా చూస్తుంది. అందుకే రోజంతా మీ శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవాలి. దానికి తగినట్లే ఆహారాన్ని తీసుకోవాలి'' అని వైద్యులు సూచిస్తున్నారు.