తెలంగాణ

telangana

ETV Bharat / health

రాత్రంతా మెలకువగా ఉంటున్నారా? - డయాబెటిస్​ వచ్చే అవకాశమట!- పరిశోధనలో వెల్లడి! - LATE SLEEP ON DIABETES

-నైట్​ మెలకువగా ఉంటే మధుమేహం ముప్పు -హార్వర్డ్​ మెడికల్​ స్కూల్​ పరిశోధకుల వెల్లడి!

Lack of Sleep and Diabetes
Lack of Sleep and Diabetes (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2025, 5:19 PM IST

Lack of Sleep and Diabetes: మనం ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 8 గంటలైననిద్రపోవాలనినిపుణులు చెబుతుంటారు. కానీ, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కాలంతో పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారు మార్నింగ్​ లేవగానే.. లంచ్​ బాక్స్​లు సర్దుకుని ఆఫీస్​కి వెళ్తున్నారు. అలాగే రాత్రి ఎప్పుడో ఇంటికి చేరుకుంటున్నారు. వ్యాపార కార్యక్రమాలు చేసే వారి లైఫ్​స్టైల్​ కూడా ఇలానే బిజీగా ఉంటుంది. ఇలా ఉద్యోగ, వ్యాపార ఒత్తిళ్ల వల్ల చాలా మంది రాత్రి సరిగా నిద్రపోవడం లేదు. అలాగే మరికొందరు నైట్​ షిఫ్ట్​ల కారణంగా రాత్రంతా మెలకువగా ఉండాల్సి వస్తుంది. ఇలా రాత్రి సమయంలో మెలకువగా ఉండేవారికి మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుత యుగంలో నైట్​ షిఫ్ట్​లు కామన్​. డ్యూటీలో భాగంగా చాలా మందికి నైట్​ షిఫ్ట్​లు ఉంటాయి. ఈ క్రమంలో రాత్రంతా పని చేసి ఉదయం నిద్రపోతారు. దీనివల్ల శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. ఫలితంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే, రాత్రంతా మెలకువగా ఉండే వారికి మధుమేహంవచ్చే అవకాశం అధికంగా ఉందని హార్వర్డ్​ మెడికల్​ స్కూల్​కి చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఎనిమిదేళ్ల పాటు 45-62 సంవత్సరాల వయసు కలిగిన 64వేల మంది నర్సుల లైఫ్​స్టైల్​ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. మిగతావారితో పోలిస్తే రాత్రిపూట మెలకువగా ఉండే వారికి మధుమేహం ముప్పు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ అధ్యయనం 'అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్' (Annals of Internal Medicine) జర్నల్​ ప్రచురించింది. (రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి).

సాఫ్ట్​వేర్, మీడియా, హాస్పిటల్​ ఇలా ఏ రంగంలోనైనా షిఫ్ట్​లు కచ్చితంగా ఉంటాయి. ముఖ్యంగా నైట్​ షిఫ్ట్​లు మన నిద్రపై చాలా ప్రభావం చూపిస్తాయి. కొన్నిసార్లు పనివేళల్లో మార్పుల కారణంగా నిద్ర తక్కువగా పడుతుంది. రాత్రంతా నైట్​ షిఫ్ట్​ చేసిన వారు కుటుంబ బాధ్యతల కారణంగా పగలు తక్కువసేపు నిద్రపోతారు. అలాగే ఇంట్లో పిల్లలు చేసే శబ్దాలు, టీవీ సౌండ్స్​ కారణంగా నిద్రలో తరచూ మేల్కొంటారు. రాత్రి కాగానే మళ్లీ వారు బాక్స్​ సర్దుకుని పనికి వెళ్తుంటారు. అయితే, ఇలా తక్కువ సమయం నిద్రపోవడం, ఇర్రెగ్యూలర్​ స్లీప్​ క్రమంగా మధుమేహానికి దారితీయవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

NOTE:ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

హైబీపీతో బాధపడుతున్నారా? - ఈ డివైజ్​తో ఇలా చేస్తే నార్మల్​కి వచ్చేస్తుందట!

'మెట్లు ఎక్కితే గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ తక్కువ'- రోజు ఎన్ని ఎక్కాలో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details