తెలంగాణ

telangana

ETV Bharat / health

'ఈ చిన్న మార్పులతో బెల్లీ ఫ్యాట్ సమస్యకు గుడ్​ బై'- మీరు ట్రై చేయండి! - BELLY FAT REDUCE DIET

-బెల్లీ ఫ్యాట్​తో ఇబ్బంది పడుతున్నారా? -పొట్ట చుట్టూ కొవ్వు కరగాలంటే ఇలా చేయండి!

Belly Fat Reduce Diet
Belly Fat Reduce Diet (Getty Images)

By ETV Bharat Health Team

Published : Dec 30, 2024, 1:39 PM IST

Belly Fat Reduce Diet :మనలో చాలా మంది బెల్లీ ఫ్యాట్ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. జీవనశైలి మార్పులే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి కారణం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా శరీరంలో ఇన్సులిన్‌ను నిరోధించి మధుమేహం ముప్పును పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా.. గుండె సంబంధిత సమస్యలకూ దారితీస్తుందని అంటున్నారు. అందుకే ఆ కొవ్వును త్వరగా కరిగించుకోవడం మంచిదని వివరిస్తున్నారు. అయితే ఇందుకోసం పెద్దగా వ్యాయామాలతో కష్టపడక్కర్లేదని, మన రోజువారీ అలవాట్లలో మార్పులతోనే బెల్లీ ఫ్యాట్‌ను సులభంగా కరిగించుకోవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ అలవాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మనలో చాలా మందికి చల్లచల్లటి శీతల పానీయాలు తాగాలని అనిపిస్తుంది. ఇందులో ఉండే అధిక చక్కెరలు శరీరంలోకి చేరి ఇన్సులిన్‌ స్థాయుల్ని ఒక్కసారిగా పెంచేస్తాయని నిపుణులు అంటున్నారు. దీంతో పాటు శరీరంలో కొవ్వు నిల్వలు కూడా పెరుగుతాయని వివరిస్తున్నారు. 2011లో American Journal of Clinical Nutritionలో ప్రచురితమైన "Dietary patterns and visceral fat accumulation" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. అందుకే వీటికి దూరంగా ఉండాలని.. మరీ తాగాలనిపిస్తే కొద్ది మొత్తంలోనే తీసుకొని సంతృప్తి చెందమని సలహా ఇస్తున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మనం ఆకలిగా అనిపించినప్పుడు ఏ బిస్కట్లో, స్నాక్సో తింటుంటాం. కానీ ఇవి కాకుండా.. పీచు ఎక్కువగా ఉండే నట్స్‌, గింజలు, బార్లీ, పండ్లు (బెర్రీస్‌, కమలాఫలం, పుచ్చకాయ వంటివి), కాయగూరలు (బ్రకలీ, క్యారట్‌, స్వీట్‌కార్న్‌.. మొదలైనవి), దుంపలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ప్రాసెస్డ్‌ ఫుడ్‌పై మనసు మళ్లకుండా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్తపడచ్చని వివరిస్తున్నారు. అలాగే వీటిలో ఉండే అధిక పీచు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి కూడా మంచిదని అంటున్నారు.

  • ముఖ్యంగా వంటల్లో ఇతర నూనెలకు బదులుగా కొబ్బరి నూనె వాడడం మంచిదని నిపుణులు అంటున్నారు! ఎందుకంటే అది మన శరీరంలో చేరిన కొలెస్ట్రాల్‌ని కొవ్వుగా మార్చకుండా.. శక్తిగా మార్చుతుందని వివరిస్తున్నారు. ఫలితంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్తపడచ్చని చెబుతున్నారు.
  • ఇంకా ఉదయాన్నే సాధారణ టీకి బదులుగా ఒక కప్పు గ్రీన్‌ టీ తాగడం వల్ల అందులో ఉండే కొన్ని రకాల సమ్మేళనాలు శరీరంలో జీవక్రియల పనితీరును వేగవంతం చేస్తాయని చెబుతున్నారు. తద్వారా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వులు సులభంగా కరుగుతాయని నిపుణులు వివరిస్తున్నారు.
  • బెల్లీ ఫ్యాట్ తగ్గించుకుని నాజూకైన నడుమును సొంతం చేసుకోవాలంటే వాల్‌నట్స్‌ చక్కటి ఆహారమని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే అన్‌శ్యాచురేటెడ్‌ ఫ్యాట్స్ శరీరంలో జిడ్డులాగా పేరుకుపోయిన కొవ్వుల్ని కరిగించడంలో సహాయపడతాయని వివరిస్తున్నారు. కాబట్టి రోజుకో గుప్పెడు వాల్‌నట్స్‌ని స్నాక్స్‌ సమయంలో తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.
  • మనలో ఎదురయ్యే ఒత్తిళ్లు, ఆందోళనల వల్ల శరీరంలో స్ట్రెస్ హార్మోన్‌ కార్టిసాల్‌ ఎక్కువగా ఉత్పత్తవుతుందని నిపుణులు అంటున్నారు. ఇది జీవక్రియల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపి శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుందని చెబుతున్నారు. అందుకే ఇలాంటి మానసిక సమస్యలకు దూరంగా ఉండాలంటే యోగా, వ్యాయామం, ధ్యానం వంటివి రోజువారీ అలవాట్లుగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.
  • బరువు పెరగడానికి, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి నిద్రలేమి ముఖ్య కారణమని ఓ అధ్యయనంలో తేలింది. అందుకే రాత్రుళ్లు 7-8 గంటలు సుఖంగా నిద్ర పోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
  • ఇంకా రోజూ ఏరోబిక్స్‌ సాధన చేయడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వుల్ని సులభంగా కరిగించచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా.. మెనోపాజ్‌ దశలోకి ప్రవేశించిన మహిళల్లో బెల్లీ ఫ్యాట్‌ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. అలాంటి వారు ఈ కొవ్వును కరిగించుకోవాలంటే వారానికి ఐదు గంటలు ఏరోబిక్స్‌ చేయాలని సూచిస్తున్నారు.
  • మనలో చాలా మంది పండ్ల రసాలు మంచివని తెగ తాగేస్తుంటారు. కానీ వాటిని మితిమీరి తాగడం వల్ల కూడా వాటిలో ఉండే చక్కెరలు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు. అందుకే మితంగా తాగాలని సూచిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

'వాకింగ్ ఇలా చేస్తేనే బీపీ, షుగర్, బరువు తగ్గుతుంది'- మరి ఎలా చేయాలో మీకు తెలుసా?

పసిపిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో తెలియట్లేదా? ఈ కారణాలు తెలిస్తే ఈజీగా ఆపొచ్చట!

ABOUT THE AUTHOR

...view details