తెలంగాణ

telangana

ETV Bharat / health

స్వీట్స్ చూడగానే ఆగలేకపోతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే ముందు పెట్టినా తినరు! క్రేవింగ్స్ ఈజీగా తగ్గిపోతాయట - HOW TO CONTROL SWEET CRAVINGS

-స్వీట్స్ తినాలని నాలుక లపలపలాడుతుందా? -ఈ టిప్స్​తో ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చంటున్న నిపుణులు

How to Control Sweet Cravings
How to Control Sweet Cravings (Getty Images)

By ETV Bharat Health Team

Published : Nov 14, 2024, 12:43 PM IST

How to Control Sweet Cravings: కొంతమంది తీపి పదార్థాలను చూస్తే చాలు.. తినకుండా ఉండలేరు. మరికొందరైతే అర్ధరాత్రి వేళ ఆకలేసినా సరే.. ఏదో ఒక స్వీటును కడుపులో వేసేస్తుంటారు. ఈ అలవాటు వల్ల బరువు పెరుగుతామని తెలిసినా సరే నియంత్రించుకోలేక పోతుంటారు! ముఖ్యంగా అమ్మాయిలనైతే తీపినీ దూరంగా ఉంచడం కష్టమే! ఒక్క ముద్ద లోపలికి వెళ్లలేని స్థితిలోనైనా సరే.. ఒక చాక్లెట్, స్వీట్‌కి మాత్రం ప్లేస్ ఇస్తారు. ఇంకా నెలసరి, ఒత్తిడి సమయంలో వాటి నుంచి అమ్మాయిలను దూరంగా ఉంచడం అసాధ్యమేనని చెప్పాలి! రోజూ ఇదే తీరైతేనే పెద్ద సమస్యగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్వీట్లు తినడం తగ్గించుకోవాలని అనుకునేవారికి నిపుణులు కొన్ని టిప్స్ సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్వీట్లు, చాక్లెట్లు ఇలా ఏవైనా సరే కళ్ల ముందు కనిపిస్తూ ఉంటే నోరు కట్టేసుకోవడం సాధ్యమా చెప్పండి? అందుకే ముందుగా వీటిని కళ్లెదుట లేకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల మనసు అటువైపు మళ్లకుండా ఉంటుందని చెబుతున్నారు. అయినా సరే స్వీట్లు తినాలనిపిస్తే కాస్త నీటిని తాగాలని సలహా ఇస్తున్నారు. అలా అని గ్లాసంతా ఒకేసారి పైకెత్తేయకుండా.. సిప్‌ చేస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా తాగితే తీపి తిన్న సంతృప్తే కలుగుతుందట. ఇవే కాకుండా చూయింగ్‌ గమ్‌ నములడం, స్నేహితులతో మాట్లాడడం లేదా కాసేపు వేగంగా నడవడం లాంటివి చేయాలట. ఇవన్నీ మనసుకు ఆనందాన్ని కలిగించి దృష్టి మళ్లేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఇవన్నీ చేసినా సరే.. ఆకలేసి మనసు తీపికేసి లాగుతోంటే మాత్రం ఏదైనా పండు, ఖర్జూరం, నట్స్‌ను తింటే సరిపోతుందని పేర్కొన్నారు. లేదంటే చక్కగా వేడినీటి స్నానం చేస్తే తీపి ఆలోచననే మాయం అవుతుందంటున్నారు.

నిద్ర, ఒత్తిడి వల్ల కూడా ఇలా అవుతుందట!
మనసు తీపి వైపు మళ్లడం ఆకలికి, ఇష్టానికి సంబంధించిన విషయం అనుకుంటాం కానీ మానసిక కారణాల వల్ల కూడా ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ నిద్ర సరిగా లేకపోయినా, ఒత్తిడి పెరిగినా కూడా తీపి తినాలనిపిస్తుందని అంటున్నారు. అందుకే ఇలాంటి వాటిపై కూడా దృష్టిపెట్టాలని వివరించారు. ఈ సూచనలు పాటించడం వల్ల చాక్లెట్, స్వీట్లు మిమ్మల్ని అంతగా ఆకర్షించవని అంటున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

షుగర్​ ట్రీట్​మెంట్​లో కొత్త మార్పులు? ఏ మందులు వాడాలో తెలుసా?

షుగర్​తో మానసిక వ్యాధులు వస్తున్నాయట! ఈ పరీక్షలూ తప్పనిసరిగా చేసుకుంటే బెటర్!

ABOUT THE AUTHOR

...view details