తెలంగాణ

telangana

ETV Bharat / health

స్వీట్స్ వదిలించుకోలేకపోతున్నారా? - అయితే ఇలా ట్రై చేయండి! - how to control sugar foods

How To Avoid Eating Sugar Foods : అధిక బరువు నుంచి.. షుగర్‌ వ్యాధి వరకు ఎన్నో ఆరోగ్య సమస్యలు రావడానికి ప్రధాన కారణం చక్కెర ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవడమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని చాలా మంది ఆలస్యంగా గుర్తిస్తారు. కానీ.. స్వీట్స్​ దూరం పెట్టలేరు. మీరూ ఇదే పరిస్థితిలో ఉంటే.. షుగర్‌ పదార్థాలను తినకుండా ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం.

How To Avoid Eating Sugar Foods
How To Avoid Eating Sugar Foods

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 1:38 PM IST

How To Avoid Eating Sugar Foods : మనలో చాలా మంది తీపి పదార్థాలను నేటినుంచి తినడం మానేయాలని నిర్ణయం తీసుకుంటారు. కానీ.. ఒకటీ రెండు రోజుల్లోనే మనసు లాగేస్తుంది. స్వీట్లు లాగిస్తారు! ఆరోగ్యానికి నష్టం అని తెలిసినా కూడా.. మానుకోలేరు. అయితే.. ప్రయత్నిస్తే అసాధ్యమేమీ కాదని అంటున్నారు నిపుణులు. లేకపోతే భవిష్యత్తులో అధిక బరువు, షుగర్‌ వ్యాధి వంటి సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరి.. షుగర్‌ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల జోలికి వెళ్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఒకేసారి సాధ్యం కాదు..
షుగర్‌ వ్యాధి లేనటువంటి వారి ముందు జాగ్రత్తగా చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండటం మంచిదని నిపుణుల చెబుతున్నారు. ఇది అంత తొందరగా సాధ్యం కాదు కానీ, నెమ్మదిగా ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలని అంటున్నారు. రోజూ షుగర్‌ తక్కువగా ఉండే పదార్థాలను తినేలా అలవాటు చేసుకోవాలి.

కూల్‌డ్రింక్స్, సాఫ్ట్‌ డ్రింక్స్..
మనలో చాలా మంది ఇంట్లో ఫ్రిజ్‌ డోర్‌ తీసినప్పుడు అక్కడ ఉండే కూల్‌ డ్రింక్స్, సాఫ్ట్‌ డ్రింక్స్ చూసి ఒక గ్లాసే కదా అని తాగేస్తుంటారు. కానీ, ఈ అలవాటు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. రోజూ వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరగడం, షుగర్‌ లెవెల్స్‌ స్థాయులలో మార్పులు రావడం వంటివి జరుగుతాయని చెబుతున్నారు. వీటికి బదులుగా ఒక పండు తినాలని సూచిస్తున్నారు.

ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌..
కొంత మంది ఉదయాన్నే షుగర్‌ స్థాయులను పెంచే పాన్‌కేక్‌ల వంటి వాటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటారు. కానీ.. వీటికి బదులుగా తృణధాన్యాలతో చేసిన ఆహారాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అవకాడో, ఓట్స్ వంటి వాటిని చేర్చుకోవాలని చెబుతున్నారు.

పండ్ల రసాలు..
కొంత మందికి తాజా పండ్ల రసాలను తాగడం ఇష్టం ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన అలవాటేనని నిపుణులంటున్నారు. కానీ, మార్కెట్లో దొరికే ఫ్రూట్‌ జ్యూస్‌లలో ఎక్కువగా షుగర్‌ కంటెంట్‌ ఉంటుంది. కాబట్టి జ్యూస్‌లను ఇంట్లో చేసుకోవడమే మంచిదని చెబుతున్నారు.

తగినంత నిద్ర..
నిద్రలేమి వల్ల ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని మనందరికీ తెలిసిందే. కానీ, మనిషి రోజువారీ జీవితంలో తగినంత నిద్రపోకపోతే కూడా తీపి తినాలనే కోరిక ఎక్కువ కలుగుతుందని నిపుణులంటున్నారు. ఇది మెదడును అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తినేలా ప్రభావితం చేస్తుందని తెలియజేస్తున్నారు. కాబట్టి, రోజూ నిద్రకు తగిన సమయాన్ని కేటాయించండి.

ఇంకా ఇలా చేయండి..

  • కాఫీ, టీలను తక్కువగా తీసుకోండి.
  • అధిక క్యాలరీలు ఉండే జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండండి.
  • స్వీట్‌ డిష్‌లు తినాలనే కోరిక కలిగితే పండ్లు, తృణధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోండి.
  • కెచప్, బార్బెక్యూ సాస్, స్వీట్ చిల్లీ సాస్ వంటి సాస్‌లలో ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది. వీటిని తినకుండా ఉండండి.
  • పైన తెలిపిన విషయాలను పాటిస్తూనే మనసును నియంత్రించుకునేందుకు యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోండి.
  • అలాగే రోజూ శారీరక శ్రమ కలిగించే నడక, సైక్లింగ్‌, పరుగు, వంటి వాటిని చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

అలర్ట్ - ఈ లక్షణాలు మీ పాదాలపై కనిపిస్తే.. షుగర్‌ ఎక్కువగా ఉన్నట్టే!

డయాబెటిస్​తో ఇబ్బందిపడుతున్నారా? - ఈ యోగాసనాలతో ఫుల్ బెనిఫిట్!

షుగర్ పేషెంట్స్ స్వీట్స్ తినొచ్చా? తినకూడదా? మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details