Get Rid Of Underarm Blackness Naturally :కొంత మంది చంకలు ఎంత శుభ్రం చేసుకున్నా కూడా అక్కడ అంతా నల్లగా ఉంటుంది. అయితే, ఇలా చంకల్లో నలుపుదనం ఏర్పడటానికి వివిధ కారణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హైపర్ పిగ్మెంటేషన్ గాఢత ఎక్కువగా ఉండే డియోలు వాడటం, శుభ్రత పాటించకపోవడంతోఈ సమస్య ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇలా చంకల్లో నలుపుదనం ఉన్నవారు స్లీవ్‌లెస్ డ్రెస్‌లు ధరించాలంటే కాస్త ఇబ్బంది పడుతుంటారు. అయితే, కొన్ని టిప్స్ పాటించడం ద్వారా ఈజీగానలుపు రంగును తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
కలబంద గుజ్జు :
చంకల్లో నలుపుదనం తగ్గించుకోవడానికి కలబంద గుజ్జు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిని నలుపుదనం ఉన్నచోట అప్లై చేసుకొని 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే ఈ సమస్య తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. 2018లో "ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ" జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. చంకల్లో కలబంద జెల్‌ను రోజుకు రెండుసార్లు మహిళలు అప్లై చేసుకోవడం వల్ల, అక్కడ నలుపు తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో న్యూయార్క్‌లోని మౌంట్ సినాయి స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన 'డాక్టర్ డేవిడ్ డబ్ల్యూ. టెంగ్' పాల్గొన్నారు. కలబంద గుజ్జును అప్లై చేసుకోవడం వల్ల చంకల్లో నలుపు రంగు తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.
వంట సోడాతో :ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్‌ల వంట సోడా, కొన్ని నీళ్లు కలిపి పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను నలుపుదనం ఉన్నచోట అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.
మీ ముఖం ముద్ద మందారంలా మెరిసిపోవాలంటే - రాత్రి వేళ ఇలా చేయండి! - How to Cleanse Face Every Night