తెలంగాణ

telangana

ETV Bharat / health

మహిళలూ 40 దాటాక పొట్ట అమాంతం పెరుగుతోందా? - ఈ ఆహారాలతో కొవ్వు ఇట్టే కరుగుతుందట! - FOODS TO REDUCE MENOPAUSE BELLY

-40 దాటాక పెరిగే పొట్ట ఇతర అనారోగ్యాలకూ దారి తీస్తుందట -ఈ ఆహారంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన

Foods to Reduce Menopause Belly
Foods to Reduce Menopause Belly (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2025, 9:33 AM IST

Foods to Reduce Menopause Belly:అప్పటివరకూ సన్నజాజి తీగలా ఉన్న నడుము కొలతలు డెలీవరి తర్వాత మారిపోతుంటాయి. పొట్ట పెరగడం, నడుము చుట్టు ఉన్న కొవ్వు పేరుకుపోవడంతో అక్కడి చర్మం వేలాడినట్లుగా కనిపిస్తుంటుంది. ఇక మెనోపాజ్‌ తర్వాత చాలా మంది మహిళల్లో ఈ మార్పు సహజం. అయితే ఇలా ఉండటాన్ని జీర్ణించుకోలేని మహిళలు, తిరిగి మామూలు స్థితికి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అందం విషయం పక్కన పెడితే, ఇలా పెరిగే పొట్ట ఇతర అనారోగ్యాలకూ దారి తీస్తుందంటున్నారు నిపుణులు. అందుకే నలభై దాటాక లేదా మెనోపాజ్‌ దశలో చక్కటి పోషకాహారం తీసుకోవడం వల్ల పెరిగే పొట్టను తగ్గించుకోవచ్చంటున్నారు. అదెలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పొట్ట పెరగడానికి కారణం ఏంటి: మెనోపాజ్‌ దశలో పొట్ట పెరగడానికి హార్మోన్ల ప్రభావం కారణమంటున్నారు నిపుణులు. ఈ దశలో ఈస్ట్రోజెన్‌ వంటి హార్మోన్లు తక్కువగా ఉత్పత్తవడం వల్ల వాటి స్థాయుల్లో సమతుల్యత లోపిస్తుందని, ఇది పొట్ట చుట్టూ, పొత్తి కడుపు దగ్గర కొవ్వులు పేరుకుపోయేందుకు ప్రేరేపిస్తుందని అంటున్నారు. కొంతమందిలో శరీర బరువు పెరగకపోయినా ఇలా పొట్ట పెరిగేసరికి అసౌకర్యానికి గురవుతుంటారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే క్రమంగా గుండె సమస్యలు, శ్వాస సంబంధిత సమస్యలు, టైప్‌-2 డయాబెటిస్​ సహా పలు రకాల క్యాన్సర్ల బారిన పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. మయో క్లినిక్​ వెబ్​సైట్​లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో కూడా ఈ విషయం స్పష్టమైంది. అంతేకాకుండా మెనోపాజ్​ బెల్లీని తగ్గించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరణ కూడా ఇచ్చింది.(రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి).

ఈ ఆహారాలు తీసుకుంటే మేలు:

  • అవిసె గింజలు ఆరోగ్యానికే కాదు అధిక బరువు తగ్గించడానికీ దోహదం చేస్తాయని, వీటిలో ఉండే మోనోఅన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులే ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. అవిసె గింజలు శరీరంలో అధిక నీరు చేరకుండా చేయడంతో పాటు ఈస్ట్రోజెన్‌ స్థాయుల్నీ క్రమబద్ధీకరిస్తాయని తెలుపుతున్నారు.
  • మన శరీరంలో విడుదలయ్యే కార్టిసాల్‌ హార్మోన్‌ ఒత్తిడికి కారణమవుతుంది. ఇదీ పొట్టభాగంలో కొవ్వు పేరుకుపోయేందుకు కారణమవుతుందని, ఈ హార్మోన్‌ స్థాయుల్ని తగ్గించడంలో దాల్చిన చెక్క సమర్థంగా పని చేస్తుందని సూచిస్తున్నారు.
  • సబ్జా గింజల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగు కదలికల్ని ప్రేరేపించి పలు జీర్ణ సంబంధిత సమస్యల్ని దూరం చేస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుందని పలు అధ్యయనాలు కూడా స్పష్టం చేసినట్లు వివరిస్తున్నారు.
  • చెడు కొవ్వుల్ని కరిగించడంలో యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ సమర్థంగా పనిచేస్తుందని అంటున్నారు. ఇందులోని లో క్యాలరీలు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి చక్కటి ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు. ఇందుకోసం, గ్లాసు నీటిలో టేబుల్‌స్పూన్‌ యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ వేసుకొని పరగడుపున తీసుకోవాలని సూచిస్తున్నారు.
  • పప్పులు, కాయధాన్యాల్లో ఫోలికామ్లం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్‌ ‘బి’, ఫైబర్‌, ప్రొటీన్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని, ఇవి పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వుల్ని కరిగించడానికి దోహదం చేస్తాయని సూచిస్తున్నారు. మయో క్లినిక్​ వెబ్​సైట్​లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో కూడా ఈ విషయం స్పష్టమైంది(రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి).
  • ఆకుకూరల్లో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యల్ని తగ్గించడంలో దోహదపడుతుందని, పరోక్షంగా శరీరంలో పేరుకున్న చెడు కొవ్వులు, పొట్టనూ తగ్గిస్తుందట!
  • మెనోపాజ్‌ దశలో తలెత్తే దుష్ప్రభావాలే మహిళల్లో వివిధ మానసిక సమస్యలకు కారణమవుతుంటాయని చెబుతున్నారు. కాబట్టి వీటిని దూరం చేసుకోవాలంటే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు, సీ-ఫుడ్‌, వాల్‌నట్స్‌ని డైట్‌లో చేర్చుకోవాలని ఓ అధ్యయనం చెబుతోన్నట్లు వివరిస్తున్నారు.
  • ఈ ఆహారాలు తీసుకోవడంతో పాటు బరువులెత్తడం, నడక, పరుగు, ఈత, సైక్లింగ్‌ వంటి వ్యాయామాలు కూడా నలభై దాటాక పొట్టను తగ్గించడంలో సహకరిస్తాయంటున్నారు నిపుణులు. అయితే ఈ నియమాలు పాటిస్తున్నా ఫలితం లేకపోతే, ఇతర సమస్యలేవైనా ఎదురైతే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమం అని సూచిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

'ఈ చిన్న మార్పులతో బెల్లీ ఫ్యాట్ సమస్యకు గుడ్​ బై'- మీరు ట్రై చేయండి!

నాజుకైన నడుము కావాలా? రోజూ ఇలా చేస్తే బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరిగి పోతుందట!

ABOUT THE AUTHOR

...view details