ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ముంపు వాసులారా! బీ అలెర్ట్‌: వణికించే వ్యాధుల జాబితా- లక్షణాలు, ముందు జాగ్రత్తలు - precautions for Seasonal diseases

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2024, 1:31 PM IST

Updated : Sep 13, 2024, 5:07 PM IST

తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఎటు చూసినా వరద తప్ప మరేమీ లేదు. ఇంటి చుట్టూ చేరిన మురుగు నీరుతో దోమలు విస్తరించే అవకాశం కూడా ఉంది. ఈ వానలకు తోడు చల్లబడ్డ వాతావరణంకు రోగాలు ప్రబలే అవకాశం ఎక్కువ. డెంగీ లాంటి విషజ్వరాలతో ఆసుపత్రులకు వచ్చే రోగాల సంఖ్య విపరీతంగా పెరిగింది. వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు సోకడం తీవ్ర కలవరానికి గురి చేస్తుంది. మరి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ కాలంలో జ్వరాల నుంచి రక్షణ లభిస్తుంది? ముఖ్యంగా డెంగీ, మలేరియా లాంటివి ప్రబలకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి.?

వణికించే వ్యాధుల జాబితా
వణికించే వ్యాధుల జాబితా (ETV Bharat)

Seasonal diseases : సీజన్‌లో వ్యాధులు అనేవి సర్వసాధారణం కానీ, అవి ప్రబలకుండా జాగ్రత్తగా ఉండటం మాత్రం మన చేతిలో పనే. జబ్బులు వచ్చాక ఇబ్బంది పడే బదులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా బాగుంటామని వైద్యులు చెబుతున్నారు. ఈ సమయంలో వాన నీటితో మురుగు నీరు కలిసి అది రోడ్డుపైకి వస్తుంది. రోడ్లపై ఉన్న గుంతల్లో, మన ఇంటి పక్కన ఉండే ఖాళీ స్థలాల్లో ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోతాయి. అవే దోమలకు నివాస స్థలాలుగా మారుతున్నాయి. వానకాలంలో దోమలతోనే విషజ్వరాల బారిన పడుతుంటారు. వర్షాల వల్ల పరిసరాల్లో దోమల సంఖ్య బాగా పెరుగుతుంది.

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి

Dengue fever : డెంగీ ఫీవర్‌, మలేరియా లాంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. దోమల నివారణ కోసం ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. జ్వరాలు ఎక్కువగ వస్తున్నాయి. అందులో మెజార్టీ వాటా డెంగీ జ్వరాలదే ఉండటం చాలా ఆందోళన కలిగించే అంశం. డెంగీ సోకిన వారికి ప్లేట్లెట్లు లాంటివి తగ్గిపోయి మరణించే అవకాశాలు కూడా ఉంటాయి.

ఆరోగ్యకరమైన ఆహారానికి నిపుణుల సూచనలు:

  • ఇంట్లో ఉండే కూలర్లు, కుండీలతోపాటు మిగతా వస్తువుల్లో నీటి నిలువలు లాంటివి ఉంటే శుభ్రం చేసుకోవాలి.
  • నీటి గుంతలు, మురుగు నీరు ఉంటే, వాటి మీద ఒక చుక్క కిరోసిన్ లేదా నూనె లాంటివి వేయాలి. దోమల వ్యాప్తిని అరికట్టవచ్చు.
  • దోమ కాటు నివారించడానికి బట్టలు నిండుగా వేసుకోవాలి.
  • ఇంటి తలుపులు సాయంత్రం కాగానే మూసి వేయాలి.
  • దోమ తెరలు వాడాలి. దోమ నాశకాలు లాంటివి ఉపయోగించాలి.
  • దోమలను నివారించడానికి డీడీటీ లాంటివి పిచకారి చేయించాలి. నివాస సముదాయాల వద్ద దోమల వ్యాప్తిని తగ్గించకోవాలి.
  • బయట ఆహారం తీసుకోకుండాఇంట్లోనే అన్ని రకాల పండ్లు తినాలి.
  • కూరగాయలతో భోజనం చేస్తే మంచిది.
  • జ్వరం వచ్చినప్పుడు సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.
  • కాచి వేడి చేసిన నీటిని మాత్రమే తాగాలి.
  • చల్లని వాతావరణం వల్ల ఇంట్లో బ్యాక్టీరియా మరింత వ్యాపించే అవకాశం ఉంది కావును ఎప్పుడూ వెచ్చగా ఉండేలా చూసుకోవాలి.

Diarrhea and vomiting: సీజనల్‌ వ్యాధుల్లో ఇటీవల పెద్ద సంఖ్యలో విజృంభిస్తోంది అతిసార. గత కొన్ని రోజులుగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తాగునీరు మురికి నీరుతో కలవడం లాంటివి జరుగుతాయి. దీంతో తాగేనీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రజలు దీనిపై అప్రమత్తంగా ఉండాలి. అలాంటి నీటిని వినియోగించకుంటేనే మేలని సూచిస్తున్నారు. ఎందుకంటే అతిసార ప్రబలి విరేచనాలు పెరుగుతాయి. ఒక్కోసారి ఇది ప్రాణపాయం కూడా.

  • అందుకే తాగునీరు ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి.
  • ఈ ఏడాది విజయవాడ పట్టణంలో అతిసార వల్ల మరణాలు సంభవించడం మనం చూశాం.
  • వేడివేడి ఆహార పదార్థాలు తీసుకోవటం ద్వారా అతిసార రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
  • అతిసార మొదలైనప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.
  • మూడు రోజులు దాటితే కాస్త ఇబ్బందికరం.

జ్వరంతో పాటు జలుబు, గొంతు నొప్పి, పొడి దగ్గు లాంటి లక్షణాలు వర్షాకాలంలో సర్వసాధారణం. ఇవే 80 నుంచి 85% వరకు వైరల్ వ్యాధులకు కారణమవుతాయి. వీటికి ఆధారం ఇన్ప్‌ఫెక్షన్‌లని వైద్యులు అంటున్నారు. జ్వరం అనేది ఒక లక్షణం. దాన్ని తడి గుడ్డ పెట్టడం, నీళ్లు బాగా తాగడం, పారాసెట్‌మాల్ వేసుకోవడంతో నియంత్రించుకోవచ్చు.

అవయవాలపై ప్రభావం - మాయదారి జ్వరంతో జనం బెంబేలు

Last Updated : Sep 13, 2024, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details