తెలంగాణ

telangana

ETV Bharat / health

ప్రెగ్నెన్సీ తర్వాత నడుం నొప్పి వేధిస్తోందా? - ఇలా చేశారంటే ఆ సమస్యే ఉండదిక! - Postpartum Back Pain Reduce Tips

Back Pain After Delivery Reduce Tips : కొంతమంది మహిళలకు డెలివరీ తర్వాత నడుం నొప్పి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఇంకొందరిలో నిద్రించేటప్పుడు, పక్కకు తిరిగినప్పుడు.. ఇలా భంగిమ మార్చినప్పుడల్లా తీవ్రమైన నొప్పి ఇబ్బందిపెడుతుంటోంది. అసలు.. ఇలా డెలివరీ అనంతరం మహిళల్లో నడుం నొప్పి తలెత్తడానికి కారణాలేంటి? ఈ నొప్పిని ఎలా తగ్గించుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

By ETV Bharat Telugu Team

Published : Jul 22, 2024, 9:30 AM IST

Tips To Reduce Back Pain After Delivery
Back Pain After Delivery Reduce Tips (ETV Bharat)

Best Tips To Reduce Back Pain After Delivery : కాన్పు తర్వాత చాలా మంది మహిళల్లో వెన్నునొప్పి ప్రాబ్లమ్స్ రావడం సహజమంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవ సమయంలో ఎముకల మధ్య ఎడం కొద్దిగా ఎక్కువై.. ఆ ప్రభావం కండరాలు, లిగ్​మెంట్లు, నరాల మీద పడుతుందట. ఫలితంగా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయంటున్నారు. ఇదొక్కటే కాదు.. డెలివరీ(Delivery) తర్వాత నడుం నొప్పి రావడానికి మరికొన్ని కారణాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..

హార్మోన్లలో మార్పులు : గర్భవతిగా ఉన్న టైమ్​లో కటి ప్రాంతం ఈజీగా సాగడానికి కొన్ని రకాల హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఇవి ప్రసవం కోసం బాడీని రెడీ చేస్తుంటాయి. అలాగే కటి ప్రాంతంలో ఉండే లిగ్​మెంట్లను.. ఆ హార్మోన్లు ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా నడుం నొప్పి రావడం స్టార్ట్ అవుతుందంటున్నారు నిపుణులు.

వెయిట్ పెరగడం : చాలా మంది మహిళలు డెలివరీ తర్వాత బరువు పెరుగుతుంటారు. ఇది కూడా ప్రసవానంతరం నడుం నొప్పి రావడానికి ఒక కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. పెరిగిన అదనపు బరువు వెన్నెముకపై ఒత్తిడిని పెంచుతుంది. ఇది నొప్పి, అసౌకర్యానికి దారితీస్తుందని చెబుతున్నారు. అలాగే పిల్లల్ని ఎత్తుకోవడం కూడా డెలివరీ తర్వాత వెన్నునొప్పిని ఎక్కువ చేస్తుందంటున్నారు. ఎందుకంటే.. పిల్లల్ని ఎత్తుకోవడం కోసం తరచూ వంగి, లేవడం వల్ల వెన్నముకపై ప్రభావం పడుతుందట. వీటితో పాటు అనస్తీషియా ప్రభావం కూడా ప్రసవం తర్వాత నడుంనొప్పి రావడానికి కారణమవుతుందని చెబుతున్నారు నిపుణులు.

డెలివరీ తర్వాత నడుం నొప్పిని తగ్గించుకోండిలా..

వ్యాయామాలు :డెలివరీ తర్వాత చాలా మంది వ్యాయామంపై అంత శ్రద్ధ చూపరు. కానీ, ప్రసవానంతరం వాకింగ్, కీగిల్ ఎక్సర్‌సైజులు వంటి చిన్న చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుందంటున్నారు. అవి చేయడం కండరాలు బలోపేతం అయి నడుం నొప్పి ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు.

2021లో "జర్నల్ ఆఫ్ ఫిజికల్ థెరపి"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ప్రసవం తర్వాత 6 వారాల పాటు వారానికి 3 సార్లు 30 నిమిషాల పాటు వ్యాయామం చేసిన మహిళలు, వ్యాయామం చేయని మహిళల కంటే నడుంనొప్పి తక్కువగా ఉందని నివేదించారు. ఈ పరిశోధనలో యూనివర్సిటీ ఆఫ్ కెనడాకు చెందిన ప్రముఖ ఫిజియో థెరపిస్ట్ డాక్టర్ జాన్ స్మిత్ పాల్గొన్నారు. వ్యాయామం చేయడం ద్వారా కండరాలు బలోపేతం అయి వెన్ను నొప్పి తగ్గడానికి తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.

కూర్చునే పొజిషన్ :ప్రసవానంతరం నడుం నొప్పి రాకుండా ఉండాలంటే కూర్చునే పొజిషన్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. ముఖ్యంగా కూర్చున్నప్పుడు వెన్ను స్ట్రయిట్​గా ఉండేలా చూసుకోవాలి. వీలైతే వెనకాల దిండును ఉంచాలి. అదేవిధంగా నిల్చున్నప్పుడు లెగ్స్ రెండు సమాన దూరంలో ఉండేలా చూసుకోవాలి.

తగినంత నిద్ర : సరైన నిద్రలేకపోతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో మనందరికీ తెలిసిన విషయమే. అలాగే డెలివరీ తర్వాత వెన్ను నొప్పి రాకుండా ఉండాలన్నా తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలట. దీంతో పాటు మీకు వీలు దొరికినప్పుడల్లా కాస్త విశ్రాంతి తీసుకోవడం మంచిదట. అదేవిధంగా పడుకునే పరుపూ సరిగ్గా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

సపోర్ట్ ఇచ్చే బెల్టులు వాడడం :నడుంకి సపోర్ట్ ఇచ్చే బెల్డ్, బైండర్ వంటి బెల్టులు వాడడం ద్వారా మంచి ఫలితం ఉంటుందంటున్నారు. ఇవి పొత్తికడుపు, వెన్ను కండరాలు మద్దతునిచ్చి నడుంనొప్పిని తగ్గించడంలో సహాయపడతాయంటున్నారు.

ఇవేకాకుండా.. బిడ్డను ఎత్తుకునేటప్పుడు, ఇంకేవైనా బరువులు ఎత్తేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. నేరుగా వంగకుండా మోకాళ్లను కాస్త వంచి ఎత్తుకోవడం మంచిదంటున్నారు. అలాగే హీటింగ్ ప్యాడ్ వాడడం, ఐస్ ప్యాక్ పెట్టడం వల్ల కూడా నడుం నొప్పిని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవీ చదవండి :

కాన్పు తర్వాత పథ్యం పాటించాలా? బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ప్రెగ్నెన్సీ తర్వాత అందం తగ్గిపోయిందా? - ఈ టిప్స్‌ పాటిస్తే మీ బ్యూటీని తిరిగి పొందొచ్చు!

ABOUT THE AUTHOR

...view details