Constable Commits Suicide Over Ganja Accusations : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కానిస్టేబుల్ సాగర్ ఆత్మహత్యకు యత్నించే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ ఈరోజు సాయంత్రం మృతి చెందాడు. ఏనుకూరుకు చెందిన సాగర్ బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా సాగర్ విధులు నిర్వహించాడు. గతంలో బూర్గంపాడుకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు, అప్పటి ఎస్‌ఐతో సన్నిహితంగా ఉండి గంజాయి పక్కదోవపట్టించినట్టు ప్రచారం జరిగింది. ఈ గంజాయి కేసుకు సంబంధించి లావాదేవీలన్నీ సాగర్ సెల్‌ఫోన్ ద్వారా మాట్లాడే వారని తెలిసింది.
గంజాయి స్మగ్లింగ్ కేసులో సాగర్‌ను పోలీసు అధికారులు 8 నెలల క్రితం సస్పెండ్ చేశారు. చేయని తప్పుకు తనకు శిక్ష పడిన విషయంపై సాగర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పటి ఎస్‌ఐ బదిలీ అయిన తర్వాత ఎస్‌ఐగా వచ్చిన వారు వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని అమ్ముకొని తనను బలి పశువును చేశారంటూ సాగర్ సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగి మరీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చేయని నేరానికి తనకు శిక్ష పడిన విషయంపై సాగర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాను అని వీడియోలో తెలిపాడు. తనకు న్యాయం జరగదేమోననే ఆలోచనలో ఆత్మ హత్యాయత్నం చేసుకునే వరకు వచ్చింది. సాగర్ సస్పెన్షన్ వ్యవహారం, ఇప్పుడు అతను ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గంజాయి పక్కదోవ పట్టిన కేసులో అసలు ముద్దాయిలు ఎవరో తేల్చాలని స్థానికులు కోరుతున్నారు.
సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని హెడ్ కానిస్టేబుల్ సూసైడ్ : మరో సంఘటనలో మహబూబూబాద్ జిల్లాలో ఏర్ కానిస్టేబుల్ జీ శ్రీనివాస్ తన గన్‌తో కాల్చుకుని, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్, ఇవాళ సాయంత్రం తన వద్దనున్న గన్‌తో కాల్చుకున్నాడు. పేలుడు శబ్జం రాగానే హుటాహుటిన పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకోగా, అప్పటికే రక్తపు మడుగులో కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయి ఉన్నాడు.
సమాచారం అందుకున్న వెంటనే మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ డేవిడ్‌లు ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. శ్రీనివాస్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. 1990 బ్యాచ్‌కు చెందిన శ్రీనివాస్, గత ఐదు సంవత్సరాలుగా కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉంటున్నాడు. భార్యాబిడ్డలకు దూరమయ్యానన్న దిగులుతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తిరుపతి రావు తెలిపారు.
మహిళను హత్య చేసి - మర్డర్‌ను రేప్ సీన్‌గా మార్చి - కటకటాల్లోకి కి'లేడీ' - Kukatpally Murder Case