తెలంగాణ

telangana

ETV Bharat / health

ముఖం తళతళ మెరిసిపోవాలా? కరివేపాకుతో ఈ ఫేస్​ప్యాక్​లు ట్రై చేయండి! - Curry Leaves Benefits - CURRY LEAVES BENEFITS

Curry Leaves Benefits For Skin : కరివేపాకు.. ప్రతి ఒక్కరి వంటింట్లో ఉంటుంది. పప్పు, కూరలు, పచ్చడి.. ఇలా వంట ఏదైనా రెండు రెమ్మల కరివేపాకు వేస్తే రుచి, సువాసనతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అయితే కరివేపాకుతో ఆరోగ్యమే కాదు అందం కూడా మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు. అందుకోసం కొన్ని ఫేస్​ ప్యాక్​లు ట్రై చేయమంటున్నారు. అవేంటంటే..

Curry Leaves Benefits For Skin
Curry Leaves Benefits For Skin

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 1:36 PM IST

Curry Leaves Benefits For Skin :అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకోసం రోజూ ఎన్నో రకాల బ్యూటీ ప్రాడక్ట్స్‌ వాడుతుంటారు. అయితే, కొన్ని రకాల కాస్మెటిక్ ఉత్పత్తులను తరచూ వాడటం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు ఏర్పడుతుంటాయి. దీనివల్ల అందవిహీనంగా కనిపిస్తాము. అలా కాకుండా నేచురల్​గా అందంగా కనిపించాలంటే వంటింట్లో లభించే కరివేపాకును ట్రై చేయమని నిపుణులు సలహా ఇస్తున్నారు. కరివేపాకుతో ఫేస్‌ప్యాక్‌లు వేసుకోవడం వల్ల మచ్చలేని అందమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు. మరి కరివేపాకుతో ఫేస్‌ప్యాక్‌లను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

పోషకాలు పుష్కలం :కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీమైక్రోబయల్ వంటి గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు, చర్మాన్ని మెరిసేలా చేస్తాయని నిపుణులంటున్నారు. అలాగే జుట్టు ఆరోగ్యంగా, రాలిపోకుండా ఉంచుకోవచ్చని చెబుతున్నారు. కరివేపాకు ఫేస్‌ప్యాక్‌లను అప్లై చేసుకోవడం వల్ల ముఖంపైన ఉన్న మచ్చలు తొలగిపోయి ముఖం అందంగా కనిపిస్తుంది. అలాగే కరివేపాకులో ఉండే ఔషధ గుణాలు చర్మానికి తేమను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

కరివేపాకు పేస్ట్​:

కరివేపాకు ఫేస్‌ప్యాక్‌ను తయారు చేయడానికి ముందుగా ఒక 5 రెమ్మలను నీటిలో ఉడకబెట్టాలి.

తర్వాత ఈ ఆకులను నీటిలో నుంచి తీసి మెత్తని పేస్ట్‌లాగా రుబ్బుకోవాలి.

ఇప్పుడు ఈ పేస్ట్‌లోకి కొద్దిగా పెరుగు లేదా పాలను వేసుకొని బాగా కలుపుకోవాలి.

ఇందులోకి కొద్దిగా తేనెను కలుపుకొని ముఖానికి ఫేస్‌ప్యాక్‌లాగా అప్లై చేసుకోవాలి.

ఒక ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో క్లీన్‌ చేసుకోవాలి.

వారానికి రెండు నుంచి మూడు సార్లు ఇలా కరివేపాకు ఫేస్‌ప్యాక్‌ అప్లై చేసుకోవడం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గుతాయని నిపుణులు పేర్కొన్నారు.

పరిశోధన వివరాలు :2019లో "ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ" జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, కరివేపాకు పాలు కలిపి తయారు చేసిన పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల మచ్చలు, ముడతలు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో బెంగళూరులోని గాంధీ వైద్య కళాశాలలో పనిచేసే డాక్టర్. శ్రీలక్ష్మి పాల్గొన్నారు. కరివేపాకు, పాలతో చేసిన పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల మచ్చలు, ముడతలు తగ్గినట్లు ఆమె పేర్కొన్నారు.

కరివేపాకు మజ్జిగ తాగితే ఎన్నో లాభాలు! స్కిన్ ఇన్ఫెక్షన్లు దూరం! - Curry Leaves Buttermilk Benefits

కరివేపాకు నీళ్లతో :కరివేపాకుతో ఫేస్‌ప్యాక్‌లను అప్లై చేసుకోవడంతో పాటు, కరివేపాకు మరగబెట్టిన నీళ్లతో ముఖం కడుక్కొవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందని నిపుణులంటున్నారు. ఇలా కరివేపాకు వాటర్‌తో తరచూ ఫేస్‌ను కడుక్కోవడం వల్ల ముఖంపై మచ్చలు తగ్గుతాయని చెబుతున్నారు.

  • కరివేపాకు నీళ్లలో కొద్దిగా శనగపిండి, నిమ్మరసం కలిపి కూడా ముఖానికి ఫేస్‌ప్యాక్‌ను చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా ముఖం మెరుస్తుందని చెబుతున్నారు నిపుణులు.

NOTE:ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఈ టీ తాగితే - 300 ఉన్న షుగర్ కూడా నార్మల్​కు రావడం పక్కా! - Health Benefits of Mango Peel Tea

డైలీ సోంపు గింజలను ఇలా తీసుకున్నారంటే - డయాబెటిస్​కు ఈజీగా చెక్ పెట్టొచ్చు! - Fennel Seeds for Diabetes

ABOUT THE AUTHOR

...view details