Causes Of Back Pain in Women :నేటి ఆధునిక జీవితంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నడుము నొప్పి ఒకటి. ఈ నొప్పితో మహిళలు పడే బాధ మాటాల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. వెన్నులో అనుక్షణం సూదులతో గుచ్చినట్లుగా తీవ్రంగా ఉంటుంది. మరి.. మహిళల్లో ఈ వెన్నునొప్పి రావడానికి కారణాలు ఏంటి ? ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి? అనే ప్రశ్నలకు నిపుణులు ఏం చెబుతున్నారన్నది తెలుసుకుందాం.
వెన్నునొప్పికి కారణాలు..
- మనం వంగినా, కూర్చున్నా సరే.. నడుము స్ట్రెచ్ కావడానికి వెన్నులోని డిస్క్‌లు హెల్ప్ చేస్తాయి. అయితే.. కొంత మందిలో డిస్క్‌లు అరిగిపోవడం వల్ల, అలాగే డిస్క్‌లు పక్కకు జరిగిపోవడం వల్ల నడుము నొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
- నడుము నొప్పి రావడానికి మరో ప్రధాన కారణం వెన్ను పూసల మధ్య ఉన్న మృదులాస్థి తగ్గిపోవడమని అంటున్నారు. కార్టిలేజ్ తగ్గిపోయి ఆస్టియోఫైట్స్ ఏర్పడటం వల్ల నడుము నొప్పి వస్తుంది.
- అలాగే బ్యాక్ పెయిన్ రావడానికి మరో కారణం.. వెన్నెముక చివరి భాగం అరిగిపోవడమేనని నిపుణులు చెబుతున్నారు.
- ఇవే కాకుండా.. టీబీ, క్యాన్సర్ వంటి జబ్బులతో బాధపడుతున్న వారు కూడా నడుము నొప్పితో బాధపడతారు.
- మనం రోడ్డుపై బైక్‌పై ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా అనుకోని కారణాల వల్ల ప్రమాదానికి గురై గాయాలపాలైనా కూడా నడుము నొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
చంకలో ఎర్రటి దద్దుర్లు ఇబ్బందిపెడుతున్నాయా? - అయితే కారణాలు ఇవే!
నడుము నొప్పి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ?
- నడుము నొప్పితో బాధపడేవారు వంగి చేసే పనులకు దూరంగా ఉండాలి.
- అలాగే వీరు నొప్పి అధికంగా ఉన్నప్పుడు బెడ్ రెస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం.
- ఇలా చేయడం వల్ల కండరాలకు కొంత విశ్రాంతి కలిగి నొప్పి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
- ఇలాంటప్పుడు లేవడం, కూర్చోవడం మరింత ఇబ్బందిగా ఉంటే రెండు, మూడు రోజుల వరకు విశ్రాంతి తీసుకోవాలి.
- పడుకునేటప్పుడు పిల్లలు ఎలా కాళ్లు, చేతులను ముడుచుకుని పడుకుంటారో అలా పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నొప్పి కొంత వరకు తగ్గుతుంది.
- నడుము నొప్పి ఎక్కువగా ఉన్నవారు వేడి నీళ్లలో ఒక వస్త్రం ముక్కను ముంచి, తర్వాత నీళ్లను పిండేసి పెయిన్ ఉన్న చోట కాపడం పెట్టుకోవాలి.
- ఇలా ఐస్ ప్యాక్‌లను కూడా ట్రై చేయొచ్చని నిపుణులంటున్నారు.
- బ్యాక్ పెయిన్ అధికంగా ఉన్నవారు వైద్యులను సంప్రదించి, ఫిజియోథెరపీ లాంటి చికిత్సలు తీసుకోవడం వల్ల తొందరగా నొప్పి నుంచి ఉపశమం పొందవచ్చు.