Breathing Exercises for Lungs Health :మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి.. ఊపిరితిత్తులు. వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. కానీ.. పలు కారణాలతో వాటిలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో.. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే పలు శ్వాస వ్యాయామాలు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. కాలుష్య ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ఎక్కువ పొల్యూషన్ ప్రాంతాలలోకి వెళ్తే తప్పనిసరిగా మాస్క్‌లు వాడాలని అంటున్నారు పల్మనాలజిస్ట్ డాక్టర్ TLN స్వామి. అదేవిధంగా బాణసంచా పొగకు దూరంగా ఉండాలట. అన్నింటికంటే ముఖ్యంగా ధూమపానానికి వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
అదేవిధంగా.. లంగ్స్‌ని ప్రొటెక్ట్ చేయడంతోపాటు వాటి కెపాసిటీ పెంచే ప్రయత్నం చేయాలంటున్నారు. అందుకోసం.. డైలీ కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు ప్రాక్టీస్ చేయాలంటున్నారు. ఇవి చేయడం ద్వారా ముఖ్యంగా రెసిస్టెన్స్ పవర్ పెరగడమే కాకుండా లంగ్స్‌కి మంచి ఎనర్జీ దొరుకుతుందని చెబుతున్నారు.
బ్రీతింగ్ : ఇది లంగ్స్ ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు. ఇందుకోసం ముందుగా నేలపై నడుముని వంచకుండా స్ట్రెయిట్‌గా కూర్చోవాలి. ఆపై గాలిని పీల్చి మీ స్టమక్ మజిల్స్‌ని రిలాక్స్ చేయాలి. పొట్టను వీలైనంత వరకూ గాలితో నింపే ప్రయత్నం చేయాలి. చెస్ట్ కూడా గాలితో నిండేవరకూ ఇలానే చేయాలి. కాసేపు గాలిని బెల్లీ, చెస్ట్‌తో నింపి ఆ తర్వాత మెల్లిగా వదలాలి. ఇలా మీకు వీలైనంత సేపు డైలీ ప్రాక్టీస్ చేయాలి.
డయాఫ్రమెటిక్ బ్రీతింగ్ : ఈ వర్కౌట్ కూడా లంగ్స్‌ను హెల్దీగా ఉంచడంలో చాలా బాగా తోడ్పడుతుందని NIH బృందం కూడా వెల్లడించింది. (National Cancer Institute రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి). ఈ వ్యాయామం చేయడానికి.. ముందుగా నేలపై కూర్చొని మీ రెండు చేతులలో ఒక హ్యాండ్‌ని పొట్ట మీద మరో దాన్ని ఛాతీపై ఉంచాలి. ఆపై ముక్కుతో గాలిని తీసుకోవాలి. అప్పుడు మీ ఉదరభాగం పెరుగుతున్నట్లుగా అనిపించాలి. కానీ, ఛాతీ మాత్రం స్థిరంగా ఉండాలి. అలా కాసేపు ఉండి తర్వాత నెమ్మదిగా నోటి ద్వారా గాలిని రిలీజ్ చేయాలి. ఇలా రోజూ మీకు వీలైనన్ని సార్లు ప్రాక్టీస్ చేయాలి.
డీప్ బ్రీతింగ్ :ఇందుకోసం ముందుగా నేలపై సరిగ్గా కూర్చోవాలి. ఆ తర్వాత ముక్కుతో గాలిని పీల్చుకుంటూ వీలైనంత వరకు పొట్టను నింపాలి. కొద్దిసేపు అదే పొజిషన్లో ఉండి ఆపై మెల్లిగా నోటితో గాలిని వదలాలి. ఇలా మీకు వీలైనన్ని సార్లు చేయాలి.