తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వాలంటైన్స్​ డే : OTTలో టాప్ 10 తెలుగు లవ్​ స్టోరీస్​ - చూస్తే ప్రేమలో పడపోతారంతే! - Top 10 OTT Love Story Movies

Valentines Day Special Top 10 OTT Love Story Movies - ఫిబ్రవరి 14 - ఈ రోజు అంటేనే లవర్స్‌కు మోస్ట్ స్పెషల్ డే. అందుకే ఈ రోజు సందర్భంగా పలు ప్రేమకథా చిత్రాలను రిలీజ్ చేస్తుంటారు మేకర్స్. పైగా ఈ మధ్యలో టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కువైంది. అయితే థియేటర్లకు వెళ్లని వారి కోసం ఓటీటీలోనూ పలు ప్రేమ కథా చిత్రాలు ఫీల్​ గుడ్ లవ్ స్టోరీస్​ అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూసేద్దాం.

Etv Bharat
వాలంటైన్స్​ డే : OTTలో టాప్ 10 తెలుగు లవ్​ స్టోరీస్​ - చూస్తే ప్రేమలో పడపోతారంతే!

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 11:03 AM IST

Valentines Day Special Top 10 OTT Love Story Movies - వాలెంటైన్స్ డే వచ్చేసింది. మరి ఈ రోజున మనసారా ప్రేమించిన వ్యక్తితో కలిసి గడిపితే ఆ ఆనందమే వేరు. అందుకే ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మూవీ లవర్స్​ కోసం మంచి మంచి ప్రేమకథా చిత్రాలను రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అయితే కొంతమంది ఇంట్లోనే ఉండి ఏకాంతంగా గడుపుదామనుకుంటారు. అలాంటి వారి కోసం ది బెస్ట్ టాప్ 10 ఓటీటీ చిత్రాలను మీ ముందుకు తీసుకువచ్చాము. మరి ఆ చిత్రాలు ఏంటి? ఎందులో చూడాలి అనే వివరాలు ఈ స్టోరీలో చదివి తెలుసుకుందాం.

ఓటీటీలో అందమైన ప్రేమ కథ చిత్రాల వివరాలివే

1. ప్రేమికుల రోజు - కునాల్, సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాతిర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇప్పటికీ ఈ పాట యూత్​ను ఉర్రూతలూగిస్తూనే ఉంటుంది. ప్రముఖ ఓటీటీ డిస్ని ప్లస్ హాట్ స్టార్, జియో సినిమా, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ లలో ఈ చిత్రం అందుబాటులో ఉంది.

2. చెలి - గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో మాధవన్, రీమాసేన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం బ్లాక్ బస్టర్​ హిట్​గా నిలిచింది. యూట్యూబ్​లో ఈ చిత్రం అందుబాటులో ఉంది.

3. సఖి - మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ ప్రేమ కావ్యంలో మాధవన్, శాలిని హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి కూడా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమా పాటలు కూడా చాట్ బస్టర్​గా నిలిచాయి. యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉందీ చిత్రం.

4. రోజా - అరవింద్ స్వామి, మధుభాల నటించిన ఈ చిత్రం కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. యూట్యూబ్ లో అందుబాటులో ఉందీ సినిమా.

5. నువ్వు నేను ప్రేమ - సూర్య, జ్యోతిక, భూమిక నటించిన ఈ చిత్రం లవర్స్​ను విపరీతంగా ఆకట్టుకుంది. ఎన్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిచారు. యూట్యూబ్​లో అందుబాటులో ఉందీ చిత్రం.

6. తొలిప్రేమ -పవన్ కల్యాణ్, కీర్తి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం డిస్ని ప్లస్ స్టార్ లో ఉంది.

7. ప్రియురాలు పిలిచింది - అతిత్, మమ్ముట్టి, ఐశ్వర్యరాయ్, టబు నటించిన ఈ చిత్రం కూడా సెన్సేషన్​ క్రియేట్ చేసింది. ఇది యూట్యూబ్​లో అందుబాటులో ఉంది.

8. ఏ మాయ చేశావే - గౌతమ్ మీనన్ తెరకెక్కించిన అందమైన ప్రేమ కథా చిత్రాల్లో ఈ చిత్రం కూడా ఒకటి. నాగచైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

9. ఏటో వెళ్లిపోయింది మనసు -దీన్ని కూడా గౌతమ్ మీననే తెరకెక్కించారు. నాని, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం యూత్​ను బాగా ఆకట్టుకుంది. యూట్యూబ్ లో దీన్ని చూడొచ్చు.

10. సీతారామం - దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన ఈ సెన్సేషనల్ హిట్​ ప్రేమ కావ్యం ప్రస్తుతం థియేటర్లలోనూ రీరిలీజ్​ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఎంచక్కా ఈ సినిమాల్లో ఏదో ఒకటి చూస్తూ మీ పార్ట్నర్​తో ఎంజాయ్​ చేయండి..

రూట్ మార్చిన టాలీవుడ్ స్టార్స్​ - ఈసారి సమ్మర్​లో మరింత కొత్తగా!

వాలంటైన్స్​ డే : అనుపమ టు మృణాల్ ఠాకూర్ - ఈ ముద్దుగుమ్మల ప్రేమ కథలు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details