This Week OTT Releases : వీకెండ్ వచ్చేసింది. దీంతో ఓటీటీల్లో ఎప్పటిలానే పలు సినిమా, సిరీస్లు రిలీజ్కు సిద్ధమైపోయాయి. అందులో తెలుగు ప్రాజెక్ట్లు కూడా ఉన్నాయి. మరి ఈ వీకెండ్ కోసం రెండు రోజుల ముందుగానే వచ్చేసిన ది బెస్ట్ సినిమా, సిరీస్లు ఏంటో వివరాలను తెలుసుకుందాం.
గొర్రె పురాణం - ఈ మధ్య వరుసగా హిట్స్ అందుకుంటున్న యంగ్ హీరో సుహాస్ రీసెంట్గా సెప్టెంబర్ 20న థియేటర్లలో గొర్రె పురాణంతో ప్రేక్షకులను అలరించారు. కొన్ని వాస్తవ సంఘటనలతో ఇది తెరకెక్కింది. ప్రస్తుతం ఈ చిత్రం ఆహా ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత 20 రోజుల్లోనే ఇది ఓటీటీలోకి వచ్చేసింది.
పైలం పిలగా - రీసెంట్గా తెలుగులో విడుదలైన లవ్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా పైలం పిలగా. ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమాలో సాయి తేజ కల్వకోట, పావని కరణం నటించారు.
తత్వ - తెలుగు క్రైమ్ థ్రిల్లర్ 'తత్వ' కూడా ఈటీవీ విన్లోనే నేటి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. హిమ దాసరి, ఉస్మాన్ గని, పూజా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. రిత్విక్ యెలగరి దర్శకత్వం వహించారు.