Tarak Ponnappa Pushpa 2 Dialogue : పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ ముందు దుమ్మురేపుతోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమా అంతా ఒక ఎత్తు అయితే, సినిమాలోని జాతర సీన్ మరో ఎత్తు. ఆ సన్నివేశంలో అల్లు అర్జున్ అమ్మవారి వేషధారణలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేశారు. బన్నీ ఆహార్యం, హావాభావాలు, సాంగ్, డ్యాన్స్, చుట్టూ ఉన్న జాతర వాతావరణం థియేటర్లను షేక్ చేసేశాయి.
ఈ పాట తర్వాత వచ్చే ఫైటింగ్ సీక్వెన్స్ కూడా అదిరిపోతుంది. ఆ సన్నివేశంలో బుగ్గారెడ్డి పాత్ర (అరగుండు)లో నటుడు తారక్ పొన్నప్ప కూడా తన విలనిజంతో బాగా ఆకట్టుకున్నాడు. సినిమాలో ఆయన కనిపించేది కాసేపే అయినా, పాత్ర మాత్రం కీలకం. రప్పారప్పా ఫైట్ సీన్‌లో ఆయన పాత్ర కీలకంగా ఉంటుంది.
అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పుష్ప 2లో తన పాత్రకు సంబంధించిన ఓ డైలాగ్‌ను ఎడిటింగ్‌లో డిలీట్ చేసినట్లు చెప్పారు తారక్. అంతేకాదు ఆ డైలాగ్‌ను కూడా ఇంటర్వ్యూలో చెప్పారు. "పుష్ప, ఆ పొద్దు నువ్వు జాతరలో కొట్టినప్పుడు నాకేం అనిపిచ్చలే, ఏదో అన్నతమ్ముడి కొట్లాట అని వదిలేసినా, కానీ ఈ పొద్దు టీవీలో వార్నింగ్ ఇచ్చినావ్ చూడు, అప్పుడు తగిలినాది నువ్వు కొట్టిన ప్రతీ దెబ్బ, ఏందీ ఆ అమ్మి మీద చిన్న గీటు పడితే రప్పారప్పా అని నరుకుతావా" అంటూ డిలీటెడ్ డైలాగ్‌ను అదిరేలా చెప్పారు తారక్.