Suriya Special Treat To Fans :ఎవరికైనాసాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు హీరోలు సూర్య, కార్తి. వరదల సమయంలోనూ తమవంతు సహాయాన్ని ఈ స్టార్స్ తాజాగా మరోసారి తమ మంచి మనసు చాటుకున్నారు. తమ ఫ్యాన్స్ కోసం స్పెషల్‌గా విందు ఏర్పాటు చేశారు. వాళ్లతో కాసేపు ముచ్చటించారు.
గతంలో మిగ్‌జాం తుపాను చైన్నైను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. దాని దెబ్బకు చెన్నై మహా నగరం మొత్తం నీటమునిగి అక్కడి ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. విష్ణు విశాల్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి స్టార్స్ సైతం తమ పరిశరాల పరిస్థితి గురించి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. ఆ సమయంలో సూర్య తన అభిమానులందరూ స్వచ్ఛందంగా వచ్చి బాధితులను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా తనవంతుగా రూ.10 లక్షలు ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు.
ఇదిలా ఉండగా, తమ అభిమాన తార మాట కోసం సూర్య ఫ్యాన్స్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారికి సాయం చేశారు. కొన్ని ప్రాంతాల్లో భోజనాలు ఏర్పాటు చేసి పలు సేవలనూ చేశారు. ఇక వారి సేవలను గుర్తించిన సూర్య తన సోదరుడు కార్తితో కలిసి ఆ ఫ్యాన్స్ అందరి కోసం ఓ స్పెషల్ ట్రీట్‌ను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా వారందరికీ స్వయంగా ఆయనే వడ్డించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఈ సోదరులను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వారి మంచి మనసుకు 'హ్యాట్సాఫ్ చెప్తున్నారు'.