తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అప్పట్లో హోటల్ సర్వర్, ఇప్పుడేమో టాప్ విలన్ - SJ సూర్య సక్సెస్ స్టోరీ ఇదే! - SJ Suryah Career - SJ SURYAH CAREER

SJ Suryah Career : 'సరిపోదాం శనివారం' విలన్ ఎస్ జే సూర్య తన కెరీర్ తొలినాళ్లలో హోటల్​లో సర్వర్​గా పనిచేశారట. అద్దె కట్టడానికి కూడా ఇబ్బందిపడివాడినని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ క్రమంలో ఎస్ జే సూర్య సక్సెస్ ఫుల్ జర్నీపై ఓ లుక్కేద్దాం పదండి.

SJ Suryah Career
SJ Suryah Career (Source : ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2024, 9:39 PM IST

SJ Suryah Career :ఎస్ జే సూర్య ఇప్పుడీ పేరు కోలీవుడ్​లోనే కాదు టాలీవుడ్​లోనూ బాగా వినిపిస్తోంది. వాస్తవానికి చాలా మంది సినీ ప్రియులకు ఈయన సుపరిచితమే. ఎందుకంటే ఈయన నటుడు కాకముందు దర్శకుడు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్​తో కలిసి 'ఖుషి' చిత్రాన్ని అప్పట్లోనే తెరకెక్కించి కల్ట్​ బ్లాక్​ బస్టర్​ హిట్​ అందుకున్నారు. తమిళంలో అజిత్​తో 'వాలి' చేసి భారీ హిట్​ను అందుకున్నారు. అలా తమిళంలో, తెలుగులో దర్శకుడిగా తనదైన మార్క్​ వేసుకున్నారు.

హోటల్ సర్వర్​గా!
అయితే కెరీర్ తొలినాళ్లలో ఎస్ జే సూర్య ఆకలి తీర్చుకోవడం కోసం హోటల్​లో సర్వర్​గా పనిచేశారట. రోజుల తరబడి ఆకలితో అలమటించడంతో ఇలా చేరారట. ఇంటి అద్దె చెల్లించడానికి కూడా కష్టపడేవాడేవాడినని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఎస్ జే సూర్య స్వయంగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి స్టార్ డైరెక్టర్ అయ్యారు ఎస్ జే సూర్య. సౌత్ ఇండియాలో విలన్ పాత్రలకుగానూ కేరాఫ్ అడ్రస్​గా మారిపోయారు. ఈ సౌత్ ఇండియన్ విలన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.8కోట్లు- రూ.10 కోట్లు వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్​లో విలన్ పాత్రల్లో నటిస్తున్న సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్, బాబీ దేఓల్ కన్నా ఎస్ జే సూర్యనే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారట.

సినీ కెరీర్
ఎస్ జే సూర్య 1999లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ 'వాలి' మూవీతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తమిళనాడులోని చాలా థియేటర్లలో ఈ మూవీ 270రోజులు ఆడింది. ఆ తర్వాత దళపతి విజయ్​తో 'ఖుషి' తీశారు. ఆ సినిమా కూడా పెద్ద బ్లాక్ బ్లస్టర్ అయ్యింది. ఆ సినిమానే తెలుగులో పవన్ కల్యాణ్​తో, హిందీలో ఫర్దీన్ ఖాన్​తోనూ రీమేక్ చేశారు.

2005 తర్వాత సూర్య దర్శకత్వ కెరీర్ కాస్త నెమ్మదించింది. ఆశించినమేర విజయాలు దక్కలేదు. అప్పుడే నటుడి అవతారం ఎత్తారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన 'ఇరైవి' సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 2017లో మహేశ్ హీరోగా తెరకెక్కిన 'స్పైడర్', దళపతి విజయ్ 'మెర్సల్‌'లో విలన్ పాత్ర పోషించారు. ఈ సినిమాల్లో తనదైన నటనతో విలనిజం పండించడం వల్ల మరిన్ని అవకాశాలు పెరిగాయి.

వ్యక్తిగత జీవితం
జస్టిన్ సెల్వరాజ్ పాండియన్‌ అలియాస్ ఎస్ జే సూర్య 1968 జూలై 20న తమిళనాడులో జన్మించారు. ఆయన తల్లిదండ్రుల పేర్లు సమ్మనసు పాండియన్, ఆనందం. సెల్వి అనే సోదరి, విక్టర్ అనే సోదురులు ఎన్ జే సూర్యకు ఉన్నారు. తెన్ కాశీ జిల్లాలోని వాసుదేవనల్లూర్​లో పాఠశాల విద్యను పూర్తి చేశారు సూర్య. ఆ తర్వాత చెన్నైలోని లయోలా కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత దర్శకత్వం వైపు మళ్లారు.

అయితే కోలీవుడ్ దర్శకులు చాలా మంది నటనవైపు ఆసక్తి చూపారు. అందులో ఎస్ జే సూర్యతో పాటు సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, శశికుమార్, చేరన్, సుందర్ వంటివారు ఉన్నారు. అయితే ఎస్ జే సూర్య అంత సక్సెస్ మాత్రం కాలేకపోయారు. ఇటీవల నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన సరిపోదా శనివారం మూవీలో విలన్ పాత్రలో ఎస్ జే సూర్య అదరగొట్టారు. రామ్ చరణ్- శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న 'గేమ్​ఛేంజర్' సినిమాలోనూ సూర్య నటిస్తున్నారు.

'గేమ్​ఛేంజర్​లో సూర్య పాత్రకు థియేటర్లలో పేపర్లు పడతాయి' - Game Changer

ఎస్​ జే సూర్య - 'వస్తాడు, సైకోయిజంతో అలరిస్తాడు, రిపీట్​' - SJ Suryah Saripoda Sanivaram

ABOUT THE AUTHOR

...view details