SHAHRUKH KHAN PREITY ZINTA : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, నటి ప్రీతీ జింటా మంచి స్నేహితులనే విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించి హిట్ పెయిర్‌గా పేరు సంపాదించారు. అలాగే ఆఫ్ స్క్రీన్‌లోనూ షారుక్, ప్రీతీ మధ్య మంచి అనుబంధం ఉంది. బర్త్ డేలకు విషెస్ చెప్పుకుంటారు. పార్టీల్లోనూ కలుసుకుంటుంటారు.
పాత వీడియో వైరల్ -అయితే షారుక్, ప్రీతీ జింటాకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ప్రీతీ షారుక్‌ను ఇంటర్వ్యూ చేస్తుంది. అయితే ఇందులో ప్రీతీని 'మీరు ప్రెగ్నెంటా' అని షారుక్ సరదగా అడగగా, ఆమె సిగ్గుపడతారు. దానికి 'మిమ్మల్ని నేను ప్రెగ్నెంట్ చేస్తా'నని షారుక్ మళ్లీ సరదాగా అంటారు. అప్పుడు ప్రీతీ షాక్‌కు గురై మళ్లీ ఫన్నీ మూడ్‌లోకి వచ్చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు వీరిద్దరి మధ్య మంచి స్నేహా బంధం ఉందని, అందుకే షారుక్ అలా సరదాగా అన్నారని సమర్థిస్తుండగా, మరికొందరు షారుక్ ఇలా వ్యవహరించడమేంటని కామెంట్లు చేస్తున్నారు.
'ప్రీతీ జింటా నిన్ను ప్రెగ్నెంట్ చేస్తా!' - షారుక్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ - Shahrukh khan Preity Zinta - SHAHRUKH KHAN PREITY ZINTA
SHAHRUKH KHAN PREITY ZINTA : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, నటి ప్రీతీ జింటాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?
Published : Aug 17, 2024, 10:37 AM IST
కొందరు నెటిజన్లు కింగ్ ఖాన్ షారుక్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. షారుక్ వ్యాఖ్యలతో ప్రీతీ జింటా అసౌకర్యాన్ని గురయ్యారని, ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని పోస్టులు చేస్తున్నారు. ఇంకొందరు షారుక్ ఖాన్, ప్రీతీ జింటా బెస్ట్ ఫ్రెండ్స్ అని, వారి మధ్య సరదాగా జరిగిన సంభాషణను సీరియస్‌గా తీసుకోవద్దని అంటున్నారు.
షారుక్ ప్రతిభకు ఒక పవర్ హౌస్ -ఈ ఏడాది మేలో ప్రీతీ జింటా సోషల్ మీడియాలో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్‌ను నిర్వహించారు. అయితే ఇందులో ప్రీతీ అభిమాని ఒకరు షారుక్ ఖాన్ గురించి చెప్పాల్సిందిగా అడిగారు. " షారుక్ ప్రతిభకు ఒక పవర్ హౌస్ లాంటివారు. ఆయనతో పనిచేయడానికి చాలా మంది ఇష్టపడతారు. సరదాగా ఉండే నటుల్లో షారుక్ ఒకరు. ఆయనతో ఉంటే హ్యాపీగా ఉంటుంది. షారుక్ నుంచి దిల్ సే సినిమా షూటింగ్ సమయంలో చాలా నేర్చుకున్నాను. " అని ఆమె బదులిచ్చారు.
సినిమాల విషయానికొస్తే -ఇక ప్రీతీ జింటా చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ రీఎంట్రీకి సిద్ధమయ్యారు. త్వరలో లాహోర్ 1947లో సన్నీ దేఓల్తో కలిసి ఆమె కనిపించనున్నారు. ఈ చిత్రానికి రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక షారుక్ సినిమాల విషయానికొస్తే గతేడాది పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పఠాన్, జవాన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలుకొట్టగా డంకీ మాత్రం పర్వాలేదనిపించింది. ప్రస్తుతం షారుక్ కింగ్ అనే సినిమాలో నటిస్తున్నారు.