తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'సాయిపల్లవికి బెడ్​ రెస్ట్​ అవసరం - 'తండేల్'​ ప్రమోషన్స్​కు అందుకే రాలేదు' - SAI PALLAVI THANDEL MOVIE

'తండేల్'​ ప్రమోషన్స్​కు సాయి పల్లవి ఆబ్సెంట్​ - అసలు విషయం చెప్పిన డైరెక్టర్

Sai Pallavi Thandel Promotions
Sai Pallavi (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2025, 3:16 PM IST

Sai Pallavi Thandel Promotions :కోలీవుడ్ స్టార్ బ్యూటీ, 'తండేల్' హీరోయిన్ సాయిపల్లవి తాజాగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని డైరెక్టర్ చందు మొండేటి తాజాగా తెలిపారు. గత కొంతకాలంగా ఆమె సినిమా ప్రమోషన్స్​లో బిజీగా ఉండగా, తాజాగా ముంబయిలో జరిగిన ట్రైలర్‌ రిలీజ్​కు రాలేకపోయారు. దీంతో డైరెక్టర్ ఈ విషయంపై స్పందించారు.

"సాయిపల్లవి గత కొన్ని రోజులగా జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ ఆమె సినిమాకు సంబంధించిన పలు ప్రమోషనల్ ఈవెంట్స్​లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె మరింత వీక్ అయిపోయారు. డాక్టర్లు ఆమెను కనీసం రెండు రోజుల పాటైనా బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాలని సూచించారు. అందుకే ఆమె ముంబయిలో ట్రైలర్‌ రిలీజ్ ఈవెంట్​కు రాలేకపోయారు." అని చందూ తెలిపారు.

SaiPallavi Upcoming Movies : సాయి పల్లవి సినిమాల విషయానికొస్తే, రీసెంట్​గానే శివ కార్తికేయన్​తో కలిసి 'అమరన్‌' చిత్రంతో భారీ విజయాన్ని అందుకుందామె. ప్రస్తుతం తెలుగులో తండేల్‌ చిత్రంలో నటిస్తోంది. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తోన్న చిత్రమిది. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న బాక్సాఫీస్ ముందు రిలీజ్ కానుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. గతంలో ఎన్నడూ చేయని సరి కొత్త పాత్రలో చైతూ, డీగ్లామర్‌ లుక్స్‌లో సాయి పల్లవి కనిపించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ స్వరాలు ఈ చిత్రానికి చక్కటి స్వరాలు అందించారు.

శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. వేటకు వెళ్లిన పలువురు మత్స్యకారులు పాకిస్థాన్‌ కోస్ట్ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన స్టోరీ లైన్​పై ఈ సినిమా రూపొందింది. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గురించి దర్శకుడు చందూ ఓ ఆసక్తికర విషయం షేర్​ చేశాడు. ఈ చిత్రంలో ఓ సీక్వెన్స్​ను చిత్రీకరించేందుకు ఏకంగా రూ.18కోట్లు ఖర్చు చేశారట.

'తండేల్' జర్నీ వైజాగ్​లోనే మొదలైంది- అక్కడికి వెళ్లాకే అసలు క్లారిటీ వచ్చింది : నాగ చైతన్య

'అలా చేస్తే ఇక సహించను - లీగల్ యాక్షన్ తీసుకుంటా' : సాయి పల్లవి వార్నింగ్​!

ABOUT THE AUTHOR

...view details