RC 17 Announcement :గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఆయన వరసు సినిమాలకు సైన్ చేస్తున్నారు. ఇటీవలే ఆయన బుచ్చిబాబు సనాతో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన షూట్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఇప్పుడు చెర్రీ మరో సర్ప్రైజ్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఎప్పటి నుంచి చక్కర్లు కొడుతున్న రూమర్స్‌ను నిజం చేస్తూ ఓ సాలిడ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.
ఆయనకు రంగస్థలం లాంటి సెన్సషనల్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్‌తో మరోసారి కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు. హోలీ సందర్భంగా ఫ్యాన్స్‌కు విష్ చేస్తూనే ఈ విషయాన్ని తెలిపారు. రెండు ఫొటోలను రిలీజ్ చేయగా, అందులో చెర్రీ సుక్కూ హోలీ ఆడుతూ కనిపించారు. ఇక మరో ఫోటోలో RC 17 అనౌన్స్మెంట్ ఉంది. "గొప్ప పని కోసం శక్తిమంతమైన శక్తులు మళ్లీ కలుస్తున్నాయి" అంటూ గుర్రం బొమ్మ ఉన్న ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమను మరింత కలర్‌ఫుల్ చేసేందుకు RC17 రానుందంటూ తెలిపారు.
ఇది చూసిన మెగా అభిమానులు ఆనందంలో గెంతులేస్తున్నారు. చెర్రీ లైనప్ చూసి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చే సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.