Ravi Teja Multiplex :టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ నటుల్లో మాస్ మహారాజ రవితేజ ఒకరు. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ స్టార్ హీరో తన క్రేజ్‌తో ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. తాజాగా ఆయన మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. హైదరబాద్‌లో ఆయన పేరిట మల్టీప్లెక్స్‌లను ఓపెన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏషియన్ రవితేజ అనే పేరుతో హైదరబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ థియేటర్ రన్ అవ్వనుంది.
తాజాగా ఆ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన పూజ కార్యక్రమం జరిగింది. దానికి రవితేజ కుమార్తె మోక్షద హాజరయ్యారు. ఆమెను చూసిన అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోయారు. తమ స్టార్ ఈ బిజినెస్‌లోనూ సక్సెస్ అవ్వాలని ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు. మరికొందరేమో మోక్షద ఫొటో చూసి ఆమె త్వరలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్నారేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
అయితే టాలీవుడ్ హీరోల్లో మొదట మహేశ్ బాబు ఈ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. ఏఎంబీ పేరుతో హైదరాబాద్‌లో పలు మల్టీప్లెక్స్ థియేటర్లను ప్రారంభించారు. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏఏఏ పేరుతో థియేటర్ నిర్మించారు. విజయ్ దేవరకొండ కూడా మహబూబ్‌నగర్‌లో ఏవీడీ అనే థియేటర్ నిర్వాహణ బాధ్యతలు చేపట్టారు. త్వరలో విక్టరీ వెంకటేశ్ కూడా ఈ బిజినెస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.