Ram Charan Bollywood Movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'RC 16' షూటింగ్లో బిజీగా ఉన్నారు. 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే రీసెంట్గా ఆయన ముంబయికి వెళ్లారు. అక్కడ ఓ యాడ్ షూట్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో తాజాగా చెర్రీకి సంబంధించిన ఓ రూమర్ ఒకటి నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అదేంటంటే?
మైథలాజికల్ మూవీలో చెర్రీ
2024లో 'కిల్' అనే హై వోల్టేజ్ యాక్షన్ మూవీతో డైరెక్టర్ నిఖిల్ నగేశ్ భట్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాకి ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దీంతో ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. అయితే దీని కోసం ఆయన చెర్రీని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. తనతో ఓ భారీ పౌరాణిక ఇతిహాసం తీయడానికి ప్లాన్ చేస్తున్నారట.
గత ఆరు నెలలుగా రామ్ చరణ్, నిఖిల్ ఈ భారీ బడ్జెట్ పౌరాణిక సినిమా గురించి చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ భారతీయ పురాణాలలో అత్యంత కీలకమైన పాత్రల ఆధారంగా తెరకెక్కుతుందని తెలిసింది. ప్రీ-విజువలైజేషన్ ఇప్పటికే పూర్తి కావడం వల్ల ఈ ప్రతిష్టాత్మక వెంచర్‌లో చరణ్‌తో కలిసి పనిచేయడానికి ప్రొడక్షన్ టీమ్ ఉత్సాహంగా ఉందంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు మేకర్స్.