Rakul Preet Singh Jackky Bhagnani : వివాహమైన తర్వాత తొలిసారి తన భర్త జాకీ భగ్నానీ గురించి మాట్లాడారు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అసోం స్టేట్ ఫిల్మ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్లో రకుల్-జాకీ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భర్త జాకీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రకుల్. ఈ కార్యక్రమంలో తనకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువని జాకీ చెప్పగా, పక్కనే ఉన్న రకుల్ అది నిజమే అని అన్నారు. అంతేకాకుండా ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు.
'జాకీలో నచ్చిందే ఇది'
'జాకీ మంచి మనసు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కలిగిన వ్యక్తి. అతడిలో ఉన్న కామెడీ టైమింగే తొలుత నన్ను ఆకర్షించింది. ఆయన ఎప్పుడూ సరదాగా ఉంటాడు. తన చుట్టూ ఉన్నవాళ్లను సంతోషంగా ఉండేలా చేస్తారు' అని రకుల్ చెప్పుకొచ్చారు.
పెళ్లైన తర్వాత అసోం టూర్కు
కన్నడ చిత్రం 'గిల్లీ'తో తెరంగేట్రం చేశారు రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవలే హిందీ పరిశ్రమలో దశాబ్దకాలం పూర్తి చేసుకున్నారు. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో కామన్ ఫ్రెండ్స్ ద్వారా బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కాగా, గత మూడేళ్ల నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు.