Pushpa 2 Records: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'పుష్ప రూలింగ్' అస్సలు తగ్గట్లేదు. డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా ఇప్పటికే అనేక రికార్డులు బద్దలుకొట్టింది. ముఖ్యంగా నార్త్‌లో ఈ సినిమాకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే పుష్ప 2 మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు హిందీలో అత్యధిక నెట్ కలెక్షన్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డ్ సాధించింది.
పుష్ప 2 హిందీ వెర్షన్ రూ.800 కోట్లు క్లబ్లో చేరిపోయింది. 31 రోజుల్లోనే ఈ సినిమా రూ.806 కోట్ల నెట్ వసూల్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'బ్రాండ్ పుష్ప రూ.800 కోట్ల క్లబ్లో చేరిపోయింది. 31రోజుల్లోనే రూ.806 కోట్ల రికార్డ్ బ్రేకింగ్ నెట్ కలెక్షన్లు సాధించింది' అని పోస్టర్ షేర్ చేశారు. ఇక ఓవరాల్‌గా పుష్ప 2 వరల్డ్‌వైడ్ కలెక్షన్లు రూ.1800 కోట్లు (గ్రాస్) దాటిపోయింది. మరో వారంలో 'బాహుబలి 2' (రూ.1810 కోట్లు) సినిమాను దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అందులోనూ రికార్డే
రిలీజ్‌కు ముందు నుంచే ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ 'బుక్ మై షో'లో పుష్ప 2 బుకింగ్స్‌లో దూసుకుపోతోంది. రోజుకు లక్షల్లోనే టికెట్లు బుక్ అవుతున్నాయి. వీకెండ్, హాలీడేస్‌లో అయితే ఇంకా రెట్టింపు సంఖ్యలో బుకింగ్స్ ఉంటున్నాయి. ఈ క్రమంలోనే పుష్ప 2 మరో అరుదైన రికార్డ్ సాధించింది. 30 రోజుల్లో పుష్ప 2 సినిమా టికెట్ల అమ్మకాలు 20 మిలియన్ (20 కోట్లు) దాటాయని బుక్ మై షో అధికారికంగా ప్రకటించింది.