Priyamani Sharukh Khan : హీరోయిన్ ప్రియమణి గురించి సినీ ప్రియులకు తెలిసే ఉంటుంది. అందం అభినయం కలబోసిన ముద్దుగుమ్మల్లో ఈమె ఒకరు. సుదీర్ఘ కాలంగా తన నటనతో ఆకట్టుకుంటూ కెరీర్లో ముందుకెళ్తోంది. సాదాసీదాగానే సినీ రంగం ప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రాణిస్తోంది. ఆ మధ్య నేషనల్ అవార్డు కూడా అందుకుంది. అయితే ఈ మధ్య కాలంలో సౌత్ కన్నా బాలీవుడ్‌లోనే ఎక్కువ సందడి చేస్తోంది. ఫ్యామిలీ మెన్ వెబ్‌సిరీస్, జవాన్, ఆర్టికల్ 370 వంటి చిత్రాలతో మంచి హిట్లను అందుకుంది. తెలుగులోనూ రీసెంట్గా భామాకలాపం అనే వెబ్ సిరీస్ సీక్వెల్‌తో ఆకట్టుకుంది. ప్రస్తుతం థియేటర్లలో మైదాన్ సినిమాతో అలరిస్తోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన మనసులోని మాటను బయట పెట్టింది. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌పై తనకున్న అభిప్రాయాన్ని తెలిపింది.
Priyamani Sharukh Khan Movies :బాద్షాతో కలిసి పని చేసే అవకాశం రావాలేగానీ ఏదైనా వదిలేయడానికి సిద్ధం అని చెప్పింది. షారుక్‌తో మళ్లీ కలిసి నటించాలనుందని మనసులో మాట బయట పెట్టింది. ఒకవేళ షారుక్ నన్ను పిలిచి వచ్చేయ్ నాతో కలిసి పని చేయాలి అని అంటే వెంటనే వెళ్లిపోతాను. నా చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా వదిలేస్తాను. ఆయనతో కలిసి పని చేయడమే నాకు అన్నింటికన్నా ఎంతో ముఖ్యం అంటూ ఉత్సాహంగా చెప్పింది. కాగా, గతంలో చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలో 1 2 3 4 గెట్ ఆన్ ది డాన్స్‌ఫ్లోర్ సాంగ్‌లో షారుక్‌తో కలిసి చిందులేసింది ప్రియమణి. ఆ తర్వాత జవాన్ సినిమాలోనూ ఓ ముఖ్య పాత్రలో నటించి మెప్పించింది.