Prabhas Rajasaab Character :పాన్ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'ది రాజాసాబ్'కి సంబంధించి క్రేజీ అప్‌డేట్ తెలిసింది. అక్టోబర్ 23న బుధవారం ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర నిర్మాతలు ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు. స్పెషల్ వీడియోతో మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రభాస్ సింహాసనం మీద ఓ చేతిలో సిగార్, నెరిసిన జుట్టుతో ఓ రాజు లాగా డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. దీంతో ఈ పాత్రకు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ తరహా పాత్రలో ప్రభాస్ తొలిసారి కనిపిస్తుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. అంతేకాదు ఈ పాత్ర 'ది రాజాసాబ్'లో సెకండాఫ్‌లో వస్తుందని తెలిసింది. ఈ క్యారెక్టెర్ వెనుక సాలిడ్ ఫ్లాష్‌బ్యాక్ ఉంటుందని సమాచారం. ఈ పాత్రలో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, ఆయన డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్ క్రేజీగా ఉండబోతున్నాయని వార్తలు వస్తున్నాయి.
దర్శకుడు మారుతి కామెడీ, హర్రర్ జానర్లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినం చేస్తున్నట్లు టాక్. ప్రభాస్‌తోపాటు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. 2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.