Prabhas Kalki 2898 AD OTT Release Date :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. ఓటీటీ లవర్స్‌ను ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ సినిమా అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆగస్టు 22 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం కానున్నట్లు తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్, అమెజాన్‌లో సౌత్ లాంగ్వేజెస్‌లో అందుబాటులో ఉండనుంది. కాగా, ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కించగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కీలక పాత్రలో నటించారు.
కథేంటంటే : కురుక్షేత్రం ముగిసిన ఆరు వేల ఏళ్లకు ఈ సినిమా కథ మొదలవుతుంది. భూమిపై మొదటి నగరంగా పురాణాలు చెప్పిన కాశీని, చివరి నగరంగా చూపిస్తారు. భూమిపై ఉన్న అన్ని వనరులను తీసేసుకుని, స్వర్గంలా కాంప్లెక్స్ అనే మరో నగరాన్ని నిర్మించి(భూమికి ఆకాశానికి మధ్యలో) సుప్రీం యాస్కిన్(కమల్ హాసన్) పాలిస్తుంటాడు. అయితే కాశీలో బౌంటీ ఫైటర్ భైరవ (ప్రభాస్) బాగా యూనిట్స్‌ను సంపాదించి కాంప్లెక్స్‌కు వెళ్లి అక్కడ సెటిల్ అయిపోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు.
అయితే మరోవైపు సుప్రీం యాస్కిన్ చేస్తున్న ప్రాజెక్ట్ కె కోసం, కాంప్లెక్స్ సైనికులు కాశీకి వచ్చి గర్భం దాల్చిన అమ్మాయిలను తమ నగరానికి పట్టుకుపోతుంటారు. అలా చాలా మంది అమ్మాయిలను ఈ ప్రాజెక్ట్-కె కోసం గర్భవతుల్ని చేసి వారి నుంచి సీరమ్ సేకరించి ప్రయోగాలు చేస్తుంటారు. అలా సుమతి(దీపికా పదుకొణె) కాంప్లెక్స్‌లో ప్రెగ్నెంట్ అవుతుంది. ఆమె సీరమ్ ప్రాజెక్ట్ కె ఎక్స్పెరిమెంట్ కోసం సరిపోతుంది. దీంతో సుమతిని బంధించేందుకు ప్రయత్నం చేస్తారు.