తెలంగాణ

telangana

'దేవర' వీఎఫ్​ఎక్స్​ కోసం 30 రోజులు నిద్ర లేకుండా - అంచనాలకు మించేలా! - NTR Devara Movie VFX

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Updated : 3 hours ago

NTR Devara Movie Cinematographer : ఎన్టీఆర్​ నటించిన 'దేవర' చిత్రం గురించి ఆ మూవీ సినిమాటోగ్రాఫర్​ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌కు సంబంధించి మాట్లాడారు. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
NTR Devara Movie Cinematographer (source ETV Bharat)

NTR Devara Movie Cinematographer :యంగ్ టైగర్​ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. హైవోల్టేజ్‌ యాక్షన్‌ మూవీగా ముస్తాబచేశారు. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వీఎఫ్‌క్స్‌కు పెద్దపీట వేశారు. దీనిపై అటు సినీ ప్రియుల్లో ఇటు తారక్ ఫ్యాన్స్​లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆచార్య ఫ్లాప్ తర్వాత మళ్లీ హిట్ కొట్టాలనే కసితో దర్శకుడు కొరటాల శివ దీన్ని తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో మూవీ టీమ్ వరుస ఇంటర్వ్యూలతో ఆసక్తికర విషయాలు పంచుకుంటోంది. తాజాగా ఇప్పుడు 'దేవర' సినిమాటోగ్రాఫర్​ రత్నవేలు వీఎఫ్‌ఎక్స్‌పై పెట్టిన పోస్ట్‌ అందరి అంచనాలను మరింత రెట్టింపు చేసింది. ఇందులో ఆయన వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌కు సంబంధించిన పిక్‌ను షేర్‌ చేశారు.

"దేవర కలర్‌ గ్రేడింగ్‌, మ్యాచింగ్‌ భారీ వీఎఫ్‌ఎక్స్‌ షాట్‌ కోసం 30 రోజులకుపైనా నిద్రలేకుండా గడిపాం. ప్రీమియర్‌ లార్జ్‌ ఫార్మట్‌, డీ బాక్స్‌, 4డీఎక్స్‌, ఓవర్సీస్‌ 2.35ఎమ్‌ఎమ్‌ కంపెనీలు సరైన సమయానికి కంటెంట్‌ను అందించాయి. మా దేవరను థియేటర్‌లలో చూసి ఎంజాయ్ చేయండి." అని రత్నవేలు తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

అలానే ఎన్టీఆర్‌తో దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు. గతంలోనూ రత్నవేలు ఈ సినిమా గురించి కామెంట్స్ చేశారు. విజువల్‌ వండర్‌ అని పేర్కొన్నారు. సినిమాలోని పాటల గురించి ఆయన మాట్లాడుతూ డ్యాన్స్‌లో ఎన్టీఆర్‌ గ్రేస్, స్టైల్, ఎలక్ట్రిఫైయింగ్‌ స్టెప్స్‌కు ఫ్యాన్స్​ బ్రహ్మరథం పడతారు అని అన్నారు. థియేటర్లలో పూనకాలు పక్కా అంటూ ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపారు.

ఇకపోతే రీసెంట్​గానే ఎన్టీఆర్​ దేవర గురించి మాట్లాడుతూ ఈ మూవీ కథ చాలా పెద్దని అన్నారు. మొత్తం కథను చేస్తే 9 గంటల పాటు ఉంటుందని చెప్పారు. అందుకే కొంత కథతో మొదటి భాగం తెరకెక్కించినట్లు పేర్కొన్నారు. ఫైట్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. ఇంటిమేట్‌ సీన్స్‌ లేవని, రొమాంటిక్‌ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తాయని చెప్పుకొచ్చారు. ఆయుధ పూజ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌ అని వెల్లడించారు.

అఖిల్‌ అప్పటి వరకు ఫ్యాన్స్​ ముందుకు రానన్నాడు : నాగార్జున - Nagarjuna Comments on Akhil

'దేవర' బిజినెస్ లెక్కలు ఇవే! - ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ ఎవరో తెలుసా? - NTR Devara Movie

Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details